సీమాంధ్ర ఎంపీలను శాశ్వతంగా బహిష్కరించాలి: కిషన్ రెడ్డి

Screen Shot 2014-02-14 at 5.44.21 PM
సీమాంధ్ర నేతల తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రానికి ఉన్న మంచి పేరును ఎంపీలు చెడగొట్టారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు తలదించుకునేలా పార్లమెంటులో ఎంపీలు ప్రవర్తించారన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే ఘర్షణకు కారణమైన ఎంపీలను నిషేదించాలని పార్లమెంట్ కు రాకుండా చూడాలన్నారు.

తెలంగాణపై బీజేపీ వైఖరిలో మార్పు లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బిల్లు పెడితే పార్లమెంటులో మద్దతిస్తామన్నారు. బీజేపీ యూ టర్న్ తీసుకుందని కమల్ నాథ్ వక్రీకరిస్తున్నారని విమర్శించారు. స్పీకర్ చర్యలు తీసుకోకపోతే రాష్ట్రపతి జోక్యం చేసుకోవలన్నారు. సీమాంధ్ర ప్రాంత సమస్యలు కూడా పరిష్కరించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పాస్ అవుతుందని అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారని కిషన్ రెడ్డి తెలిపారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy