తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే దళిత సీఎం : జైరామ్ రమేష్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి  చేస్తామని కేంద్రమంత్రి, కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ చెప్పారు. అలాగే, హైదరాబాద్ లాంటి గొప్ప కానుకను తెలంగాణకే ఇచ్చామని, జూన్ 2 నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే ప్రతి పైసా కూడా తెలంగాణకే చెందుతుందని ఆయన చెప్పారు. రెండు రాష్ట్రాలలోను పొత్తుల విషయం కేంద్రమే చూసుకుంటుందని కూడా రమేష్ వెల్లడించారు. కిరణ్ కుమార్ రెడ్డిని చీఫ్ విప్ గా, స్పీకర్ గా, ఆ తరువాత సీఎమ్ గా కూడా చేసినా….చివరకు కాంగ్రెస్ ని మోసం చేసి వెళ్ళిపోయారని రమేష్ విమర్శించారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy