తెలంగాణలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

బంగాళాఖాతం తూర్పు ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఏర్పడిన అల్పపీడనం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరం వైపు పయనిస్తోంది. ఇది గురువారానికల్లా మరింత తీవ్రమై వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని తెలిపారు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉంది. దాని ప్రభావంతో తెలంగాణలో గురు, శుక్రవారాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు.

ఇప్పటికే రెండు రోజులుగా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఎల్లారెడ్డిలో 7సెంటీమీటర్లు, టేకులపల్లిలో 6.1, రామన్నపేట 6, భీమదేవరపల్లి, సదాశివనగర్‌, వనపర్తి, దేవరకొండ ఏటూరునాగారంలో 5, సింగరాజ్‌పల్లిలో 4.6, ముదిగొండలో 4.5, మంగపేటలో 4.4, జూలూరుపాడులో 3.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలో వాతావరణం చల్లబడి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy