తెలంగాణలో స్కిల్ డెవలప్ మెంట్ మినిస్ట్రీ

skills-development-ministryతెలంగాణలో స్కిల్ డెవలప్ మెంట్ మినిస్ట్రీని ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తోంది రాష్ట్ర సర్కార్. దీనికి సంబంధించిన ఫైల్ సీఎం ఆమోదం కోసం పంపారు అధికారులు. కేంద్రంలో నైపుణ్యాభివృద్ధిశాఖ గత మూడేళ్లుగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోనూ అదే విధానాన్ని అమలు చేయాలని భావించిన కేసీఆర్ సర్కార్  ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందుకోసం ప్రత్యేక డైరెక్టరేట్‌ ఏర్పాటు చేసి.. దానికి ఒక డైరెక్టర్‌ జనరల్‌ ను నియమిస్తారు. 2017-18 బడ్జెట్ లో ఇందుకోసం ఒక వేయి 575 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

రాష్ట్రంలో ఏ శాఖకు ఆ శాఖ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ లను ఏర్పాటు చేసుకొని శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇకపై అన్ని డిపార్ట్ మెంట్ లకు సంబంధించిన శిక్షణాతరగతులను స్కిల్ డెవలప్ మెంట్ మినిస్ట్రీ ద్వారానే జరిగేలా పకడ్బందీ విధానం రూపొందించాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

కొత్త మినిస్ట్రీ కార్యక్రమాలు ఇవే..

..ఇకపై అన్ని డిపార్ట్ మెంట్ లకు సంబంధించిన ఉపాధి శిక్షణాతరగతులను స్కిల్ డెవలప్ మెంట్ మినిస్ట్రీ నిర్వహిస్తుంది

… ప్రత్యేక డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేసి.. వివిధ రంగాల్లో అనుభవమున్న వ్యక్తిని డైరెక్టర్‌ జనరల్‌గా నియమించి.. ఆయన ఆద్వర్యంలో ఈ స్పెషల్ మినిస్ట్రీ కార్యక్రమాలు రూపొందిస్తుంది

…  ఏటా రూ.10 వేల కోట్ల నిధులు సమీకరించాలనే లక్ష్యాన్ని నిర్ధేశించనున్నారు

… వివిధ ఉపాధి రంగాలకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలకు కోర్సుల రూపకల్పన, మౌలిక వసతుల కల్పన వంటివి చేపడుతుంది

.. నైపుణ్యమండళ్లతో ఒప్పందాలు చేసుకుంటుంది

… ఉద్యోగాల సమీకరణ, ఉపాధి కల్పనలను ఏర్పాటు చేస్తుంది

… స్కిల్ డెవలప్ మెంట్ మినిస్ట్రీ కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తారు

… డైరెక్టరేట్‌ ద్వారా వార్షిక నైపుణ్య ప్రణాళికల రూపకల్పన, నిధుల సమీకరణ, కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలతో సంప్రదింపులు జరిపి.. వాటి సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఆ శాఖ కార్యక్రమాలు ఉంటాయి

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy