తెలంగాణా పై కాంగ్రెస్ కుట్రకిది నిదర్శనమా?

parliament

ఒక పక్క రాష్ట్ర అసెంబ్లీ లో విభజన బిల్లుపై చర్చ ఎన్ని రోజులానే విషయం పై జరుగుతూనే ఉంది.  లోక్ సభ లో మాత్రం కాంగ్రెస్ పలు వ్యూహాలు పన్ని లోక్ పాల్ బిల్లు పాస్ చేయించడమే తరువాయి సభను నిరంతర వాయిదా వేసింది. షెడ్యూలు ప్రకారం లోక్ సభ మళ్ళీ జనవరి చివర్లో బడ్జెట్ పై vote on account చర్చ కోసమే సమావేశం కావాల్సి ఉంది. అది సభకు చివరి సమావేశం కానుంది.

ఈ పరిస్థితుల్లో రాష్ట్ర శాసన సభ లో జనవరి 23 తర్వాత కూడా బిల్లు పై చర్చ జరగాలని సీమాంధ్ర సభ్యులు పట్టు పడుతున్న నేపధ్యం లో ప్రత్యెక సమావేశం పెడితే తప్ప పార్లమెంటుకు తెలంగాణా బిల్లు చేరే అవకాశం లేదు. ఈరోజు ముగిసిన సమావేశాల్లోనే ఆంధ్రా ఎం పీ ల అవిశ్వాస నోటీసులను అతి కష్టంగా తప్పించుకున్న యూ పీ ఏ  తదుపరి సమావేశాల్లో కూడా ఇవే  పరిస్థితులు ఎదురైతే ఎం చేయబోతుOదన్నది ఎవరికీ తెలియదు. పెరుగుతున్న BJP బలం, Delhi లో AAP దెబ్బ,DMK తో చీలిక, ప్రధాని అభ్యర్థిత్వం పై రాహుల్ ను ప్రకటించటం పై ఉన్న గందర గోళం… ఇలాంటి విషయాలన్నీ కాంగ్రెస్ ను తెలంగాణాపై పునరాలోచనలో పడేసాయా? అనేది ఇప్పుడు కొందరి బుర్రలను తొలిచేస్తున్న ప్రశ్న.

ఇదే సమయం లో, తెలంగాణా ను pending లో ఉంచి, ఈ విషయం పై BJP మొదట్నుంచీ చూపిస్తున్న చొరవను రాబోయే సాధారణ ఎన్నికల్లో ఎదుర్కునే స్థితి లో కాంగ్రెస్ ఉంటుందా?

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy