తెలంగాణా పై స్పందించిన ప్రధాని

mmరేపట్నుంచి పార్లమెంటు చివరి సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా రానున్న ముఖ్య బిల్లులగురించి మాట్లాడిన ప్రధాన మంత్రి మన్ మోహన్ సింగ్ తెలంగాణా గురించి కూడా మాట్లాడారు. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించాల్సిన సమయం వచ్చిందని, అన్ని పార్టీలు కూడా దీనికి సహకరించాలని ప్రధాని విజ్ఞప్తి చేసారు. ఈ సమావేశాల్లో T బిల్లు పెట్టడం ఖాయం అని అయన గట్టిగా చెప్పారు. ఒక పక్క GOM సమావేశం జరుగుతున్న తరుణంలో మన్ మోహన్ ఈ కీలక వ్యాఖ్యలు చేసారు.

మరో వైపు సమావేశాల్లో సహకరించని స్వపక్ష MP లను గతంలో లాగే మళ్ళీ సస్పెండ్ చేయడానికి సందేహించబోమన్నారు కమల్ నాథ్.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy