తెలంగాణా బిల్లు ప్రధాన సవరణలు

1.     ఖమ్మం పరిధిలో పాల్వంచ రెవెన్యూ డివిజన్ లోని కుకునూర్, వేలేరుపాడు, బూర్గుంపాడు మండలాలు, భద్రాచలం రెవెన్యూ డివిజన్ లోని  చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం మండలం, భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహాయించి మిగతా భద్రాచలం మండలం.

2.     సీమాంధ్ర రాజధాని నిర్ణయం కోసం వేసే కమిటీ గడువు 6 నెలలకు పెంపు

3.     రెండు రాష్ట్రాల్లో 2008 పునర్ విభజన ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చు

4.     రాజ్యాంగానికి లోబడి..రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను సీమాంధ్రలో 175సీట్లను 225కి, తెలంగాణలో119 నుంచి 153కు పెంచేందుకు ఈసీ నిర్ణయం తీసుకుంటుంది.

5.     రెండు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నవనరుల్ని పరిశీలించి..తగిన విధంగా కేటాయింపులు చేయాలని రాష్ట్రపతి 14 వ ఆర్థిక సంఘానికి సూచన చేయవచ్చు.

6.     దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాల కోసం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ రూపంలో తగిన గ్రాంట్లు, ప్రయోజనాలు, ప్రోత్సాహకాలు అందించొచ్చు

7.     ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలో ఉత్తరాంధ్ర, రాయలసీమపై ప్రత్యేక దృష్టి పెడుతుంది.

8.     పోలవరం ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టుగా పరిగణిస్తారు.

9.     నిర్మాణంలో ఉన్న హంద్రీనీవా, తెలుగుగంగా, గాలేరు నగరి, వెలుగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులకు ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ప్లాన్ ప్రకారం పూర్తి చేయాలి. నీటి పంపకాలు యథాతథం

10.   13వ షెడ్యూల్ లో దాదాపు అన్ని హామీలకు కొత్తగా ఆరు నెలల కాల పరిమితి విధించారు.

సీమాంధ్రకు పెట్రోలియం యూనివర్శిటీ, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మెనేజ్ మెంట్ కేటాయింపు.

ఖమ్మంలో సెయిల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై ఆర్నేళ్లలో సాధ్యాసాధ్యాలపై నిర్ణయం

కడపలో  సెయిల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై ఆర్నేళ్లలో సాధ్యాసాధ్యాలపై నిర్ణయం

వైజాగ్, విజయవాడ, తిరుపతి ఎయిర్ పోర్టులను అంతర్జాతీయ స్థాయి అభివృద్ధి సాధ్యాసాధ్యాలపై ఆర్నేళ్లలో నిర్ణయం

తెలంగాణలో 4వేల మెగవాట్ల విద్యుత్ అందుబాటులోకి తెచ్చేలా ఎన్టీపీసీ పనిచేస్తుంది.

వైజాగ్ మెట్రో, విజయవాడ-గుంటూరు-తెనాలి మెట్రో సాధ్యాసాధ్యాలపై ఏడాదిలో నిర్ణయం, ఇది పదమూడవ షెడ్యూల్ లో కొత్తగా కలిపిన విషయం.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy