తెలంగాణ ఆవిర్భావ సభ

bjp1
ప్రత్యేక తెలంగాణ సాధనలో పాలు పంచుకున్న బీజేపీ.. ఉద్యమ ఫలాలను తమ ఖాతాలో వేసుకోవడానికి పావులు కదుపుతోంది. తెలంగాణ ఏర్పాటలో బీజేపిదే కీలక పాత్ర అంటూ జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. తెలంగాణ పది జిల్లాల ప్రజలను ఒకే వేదికమీదకు తీసుకొచ్చేందుకు నిజాం కాలేజ్ గ్రౌండ్ లో భారీ బహరంగసభను నిర్వహిస్తోంది. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ తర్వాత బీజేపీ నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు కమలనాథులు. ఈ సభకు తెలంగాణ ఆవిర్భావ సభగా నామకరణం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల హడావిడి ఉండడంతో సభను విజయవంతం చేసేందుకు…పది జిల్లాల నుంచి క్యాడర్ ను భారీగా సభకు తరలిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో కౌటౌట్లు….బ్యానర్లు లేకుండానే ప్రజలను సభకు తీసుకొస్తున్నారు. బీజేపీ 272 ప్లస్ మిషన్ కార్యక్రమంతో ముందుకెళ్తోంది. మొత్తం మీద తెలంగాణ బిల్లు ఉభయ సభల్లో బిల్లు పాస్ అయిన తర్వాత నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో సభ విజయవంతంపై దృష్టి పెట్టారు కమలనాథులు.
కాంగ్రెస్,టీఆర్ఎస్ పార్టీల కంటే ముందుగానే విజయోత్సవ సభ నిర్వహిస్తున్న బీజేపీ తెలంగాణ క్రెడిట్ తన ఖాతా వేసుకోవాలనుకుటోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy