తెలంగాణ ఎన్నికల రౌండప్.. ఇవాళ్టి అప్ డేట్స్

హైదరాబాద్ : సీఎం క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత గడ్డం అరవింద్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు.

 

 

టీఆర్ఎస్ అభ్యర్థులు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, సుంకే రవి శంకర్, ప్రేమ్ సింగ్ రాథోడ్, ఎంపీ మల్లా రెడ్డిలకు బి ఫాం అందించారు మంత్రి కేటీఆర్.

….

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. టీజేఎస్ ఆఫీస్ లో కోదండరామ్ ను కలిశారు. పొత్తుల్లో సీట్లపై ఉమ్మడి ప్రకటన చేసేలా కసరత్తు చేశారు. ఈ రాత్రి నుంచే కాంగ్రెస్ అభ్యర్థులకు బీ ఫామ్ లు ఇవ్వనున్నారు.

కరీంనగర్: పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్ విజయశాంతి ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు శనివారం ఉదయం 10  గంటలకు కరీంనగర్ లో పర్యటిస్తారు.

తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన టిడిపి నేత బొల్లం మల్లయ్య యాదవ్. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. కోదాడ నియోజకవర్గ ఇంచార్జ్ శశిధర్ రెడ్డి, వేనేపల్లి చందర్ రావు, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ హాజరయ్యారు.

వికారాబాద్ జిల్లా: వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి కరణం ప్రహ్లాద్ రావ్ రాజీనామా చేశారు. బీజేపీ అభ్యర్థుల మూడవ జాబితాలోనూ తన పేరు లేకపోవడంతో..  మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు.

వికారాబాద్ జిల్లా :  వికారాబాద్ నియోజకవర్గంలోని ధారూర్ మండలంలో టీఆర్ఎస్ నాయకుల సమావేశంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

కొమురంభీం జిల్లా: సిర్పూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్  రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య.

మంచిర్యాల జిల్లా: చెన్నుర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు మంత్రి తలసాని శ్రినివాస్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ హాజరయ్యారు. టీఆర్ఎస్ తోనే సంక్షేమం సాధ్యమన్న నేతలు.. బాల్కసుమన్ ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.

వరంగల్ అర్బన్:  అధికార టిఆర్ ఎస్ సర్కార్ చేసిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. రాబోయే మహాకూటమి ప్రభుత్వంలో.. టీడీపీకి 3 మంత్రిపదవులు వస్తాయని.. తానూ మంత్రిని కావడం తథ్యం అన్నారు.

కరీంనగర్ జిల్లా: గంగాధరలో  బీజేపీ ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన సమావేశానికి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ హాజరయ్యారు. మాదిగ బిడ్డను అవడం వల్లనే తనకు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదా.. తాను చొప్పదండిని అభివృద్ది చేయలేదా అని ఆమె ప్రశ్నించారు.

….

రేపు శనివారం నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో రాష్ట్ర ఎన్నకల ప్రధాన అధికారి రజత్ కుమార్ పర్యటించనున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై అక్కడి అధికారులతో సమీక్ష జరుపుతారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy