తెలంగాణ, ఏపీలో పోటీ చేస్తాం : పవన్

PAవచ్చే ఎన్నికల్లో తెలంగాణ, ఏపీలో పోటీచేస్తామన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. సోమవారం (జనవరి-22) కరీంనగర్ లో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. తమ బలాన్నిబట్టి ఎక్కడెక్కడ పోటీ చేయాలన్నది పర్యటనలో తెలుస్తుందన్న పవన్.. తెలుగు రాష్ట్రాల్లో సమస్యలున్నాయని, ప్రస్తుతం దీనిపైనే దృష్టి పెట్టామన్నారు. రాజకీయ ప్రస్థానం ఇది కొండగట్టు నుంచి స్టార్ట్ చేశామన్న పవన్.. రేపు, ఎల్లుండి కార్యకర్తల మీటింగులు జరుగుతాయన్నారు. ముందుముందు ఏం చేయాలి. తెలంగాణలో ఎలాంటి సమస్యలు ఉనాయి. అనే దానిపై చర్చిస్తామన్నారు. 27 నుంచి అనంతపురంలో పర్యటిస్తామన్నారు. తెలంగాణకు సంబంధించిన వరకు సున్నితంగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఎలాంటి సూచనలు చేయాలి..భవిష్యత్ కార్యచరణపై కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటామన్నారు.

అనంతపురంలో కొత్త జనసేన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటుచేస్తామన్నారు. ఒంగోలులో కిడ్నీ బాధితుల సమస్యలపై తెలుసుకుంటామన్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి, చాలా సున్నితమైన పరిస్థితులను చర్చిస్తున్నామన్నారు. ఏ ప్రభుత్వం అయినా సరే..ప్రజలు తీర్పు చెప్పినప్పుడు దానికి గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలో గొడవపెట్టుకునే సందర్భాలు ఉన్నప్పటికీ సానుకూలంగా ఉన్నానన్నారు. రెండు రాష్ట్రాల్లో పర్యటించాక పోటీపై అవగాహన వస్తుందన్నారు. ఎక్కడ బలం ఉంది అనేదానిపై ఓ క్లారిటీ వస్తుందని అప్పుడే పోటీపై ప్రకటిస్తానన్నారు. ఏం చేసిన ప్రజలకు ఉపయోగపడాలన్నదే తమ ఉద్దేశమన్నారు. అనేక దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణ వచ్చింది. తెలంగాణ అంటే తనకు చాలా గౌరవం అన్నారు. బాధ్యతగా తెలంగాణను ముందుకు తీసుకెళ్లడానికి తాను ఎప్పుడు ముందుంటానన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ స్మార్ట్ సీఎం అని ప్రశంసలతో ముంచెత్తారు పవన్. పొలిటికల్ ప్రాసెస్ లో జనసేన ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది. సుదీర్ఘకాంలగా ముందుకెళ్లాలని ప్రయత్నిస్తున్నామన్నారు. తెలంగాణ అంటే తనకు చాలా ప్రేమ అని, ఎంతోమంది అభిమానులు ఇక్కడ ఉన్నారన్నారు. మంచి మేధావులు కొంతమంది రాజకీయాలకు దూరంగా ఉన్నారని, అలాంటివారు జనసేనలో సేవలు చేయడానికి వస్తున్నారన్నారు. ఉద్యోగాల కల్పన అన్ని ప్రభుత్వాలకు ఛాలెంజింగ్ లాంటిదన్నారు. సినిమాల గురించి ప్రస్తావించగా..ఇక సినిమాలు తీయలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు పవన్.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy