తెలంగాణ కోసం నా రక్తం ఇస్తా : పవన్

pawan-kalyan-bloodదేశం కోసం గుండె కొట్టుకుంటోంది..తెలంగాణ కోసం రక్తం ఇస్తానన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. కరీంనగర్‌లోని శుభం గార్డెన్స్‌లో కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల కార్యకర్తలతో పవన్‌ సమావేశమయ్యారు.

తెలంగాణ ఉద్యమం ఏ ఆశయాల కోసం జరిగిందో వాటి సాధన కోసం కలిసి వస్తానన్నారు పవన్. మడమ తిప్పే మనిషిని కాదన్నారు. మాట ఇస్తే తిరిగి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. జనసేనను వేరే పార్టీలో విలీనం చేయాల్సి వస్తే.. మీ ముందు ఎలా ఉంటానని ప్రశ్నించారు. 2019లో తెలంగాణలోనూ జనసేన పార్టీ పోటీ చేస్తుందన్నారు. తెలంగాణ యువత, ఆడపడుచుల ఆకాంక్షే.. జనసేన ఆకాంక్ష. తెలంగాణ ఆశయాల కోసం జనసేన నిలబడుతుందని స్పష్టం చేశారు. అండగా ఉండండి.. మీ కుటుంబంలో తనను ఒకడిగా చూడండిని కార్యకర్తలను కోరారు పవన్.

నేను ఎవరికీ తొత్తును కాదన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగతంగా ఎవరితోనూ శతృత్వం లేదన్న పవన్..విమర్శించే వారిని పట్టించుకునే టైం తనకు లేదన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy