తెలంగాణ గాంధీ ‘భూపతి’ ఇకలేరు….!

bhupati krishnamurthy (1)భూపతి కృష్ణమూర్తి ఆదర్శాలకు కేరాఫ్ అడ్రస్. తెలంగాణ గాంధీగా అందరికి తెలిసిన వ్యక్తి. భూపతి కృష్ణమూర్తి కేవలం ఫ్రీడం ఫైటర్ మాత్రమే కాదు….తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన వ్యక్తుల్లో ఆయనొకరు. 1969 తెలంగాణ ఉద్యమంతో పాటు మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ పాల్గొన్న గ్రేట్ ఓల్డ్ మ్యాన్. ఫిబ్రవరి 21, 1926న వరంగల్ జిల్లా గిర్మాజిపేటలో పుట్టారు భూపతి. చిన్ననాటి స్వాతంత్ర్య భావాలు కలిగిన వ్యక్తి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరి…మహాత్మగాంధీ అడుగు జాడల్లో నడిచారు. సబర్మతి ఆశ్రమానికి వెళ్లి దండి సత్యాగ్రహంలో పాల్గొన్నారు భూపతి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఆయన పోరాటం ఆగలేదు. రజాకార్ల వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. రాష్ట అవతరణ తర్వాత తెలంగాణ వెనకబాటును ఎలుగెత్తి చాటారు. 1969 తెలంగాణ ఉద్యమంలో ఫుల్లు యాక్టివ్ గా పనిచేశారు. తెలంగాణ ప్రజా సమితి వ్యవస్థాపక మెంబర్లలో ఆయనొకరు.

వరంగల్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. వరంగల్ అర్బన్ కో పరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా కొన్నేళ్లు పనిచేశారు. 90 ఏళ్ల భూపతి కృష్ణమూర్తిది నిస్వార్ధ జీవితం. ఇప్పటివరకు ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు.

1969 సమయంలో 11 ఎంపీ సీట్లు గెలిచిన ప్రజాసమితి పార్టీకి ప్రస్తుతం ఆధ్యక్షుడాయన. మర్రి చెన్నారెడ్డి పార్టీ వీడిన తర్వాత టీపీఎస్ కు ప్రెసిడెంట్ అయ్యారు. ఇక అప్పటినుంచి  అన్నింటికి ఆయనే పెద్ద దిక్కై పార్టీని నడిపిస్తున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. వయసు సహకరించకున్నా ఉద్యమంలో పాల్గొన్నారు.  తెలంగాణ రాష్ట్రాన్ని చూసి తనువు చాలిస్తానన్న భూపతి…అన్నట్టుగానే ప్రత్యేక రాష్ట్రాన్ని కళ్లారా చూసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy