తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభకు ఏర్పాట్లు పూర్తి

kodandaramతెలంగాణ జన సమితి ఆవిర్భావ సభకు అంతా రెడీ అయింది. సరూర్ నగర్ స్టేడియం TJS బహిరంగసభకు ముస్తాబైంది. ఐదంచెలతో ప్రధాన వేదికను రెడీ చేశారు. వేదికపై సుమారు వెయ్యిమంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. మరోవైపు జేఏసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు కోదండరామ్. తెలంగాణ జనసమితిలో కీలకంగా పనిచేయాలని నిర్ణయించుకోవడంతో జేఏసీ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
మరోవైపు ఇప్పటికే పార్టీ పేరు, జెండాను ప్రకటించిన కోదండరామ్.. ఆవిర్భావ సభలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, పార్టీ నిర్మాణం ఎలా ఉండబోతుందనే అంశాలను ప్రకటించే చాన్స్ ఉంది. 240 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పుతో వేదికను నిర్మించారు. మొత్తం ఐదంచెలతో వేదికను ఏర్పాటు చేశారు. మొదటి వరుసలో విద్యార్ధులు, లాయర్లు, ఎన్నారైలు కూర్చునేలా ఏర్పాటు చేశారు. రెండో వరుసలో జిల్లాల నుంచి వచ్చిన మహిళా ప్రతినిధులు..మూడో వరుసలో అమరవీరుల కుటుంబాలు, నేరెళ్ల దళితులతో పాటు ఖమ్మంలో బేడీలు వేయపడ్డ రైతులు, ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన నిర్వాసితులు ఉండనున్నారు. నాలుగు, ఐదో వరుసలో పార్టీ రాష్ట్ర  జిల్లాల నేతలు కూర్చోనున్నారు. కళాకారులకు మరో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు.
పార్టీ ఆవిర్భావ సభకు అన్నివర్గాల ప్రజలు వచ్చి విజయవంతం చేయాలని కోరారు కోదండరామ్. సరూర్ నగర్ స్టేడియంలో సభ ఏర్పాట్లను పరిశీలించిన కోదండరామ్..పాలనలో మార్పు కోసమే పార్టీ పెడుతున్నట్టు చెప్పారు.

సభ నిర్వహణకు కోసం దాదాపు 2 వందల మంది వాలంటీర్లకు ప్రత్యేకంగా రెండు రోజులపాటు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. బహిరంగ సభ నేపథ్యంలో ప్రత్యేక పాటల సీడీని రూపొందించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఆటాపాటలతో కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. సాయంత్రం సభలోనే తెలంగాణ జన సమితి అధ్యక్షునిగా కోదండరామ్ ను ఎన్నుకోనున్నారు పార్టీ నేతలు.  జేఏసీలో లేకపోయినా…జనసమితి సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు కోదండరామ్.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy