తెలంగాణ జాగృతి.. భారీ జాబ్ మేళా

Job-Melaతెలంగాణ జాగృతి తాజాగా జాబ్ మేళాకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ తో సహా 15 పట్టణాలలో జులై 4 నుంచి ఆగస్టు 25 వరకు జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జాబ్ మేళా జరుగుతుంది. పదో తరగతి ఆపై  ఉన్నత విద్యార్హత కలిగిన వారు కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చని తెలిపింది.

లాజిస్టిక్స్, రిటెయిల్, ఎలక్ట్రానిక్స్, బ్యూటీ అండ్ వెల్నెస్, హోటల్ మేనేజ్మెంట్ రంగాల్లో ఉద్యోగాల నియామకాల కోసం ఆయా రంగాల కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. వీటితోపాటు బీపీఓ, ఎలక్ట్రానిక్స్, అగ్రిబేస్డ్ కంపెనీలు, ఫార్మసీ సంస్థలు, హోటల్ పరిశ్రమ, బ్యూటీ అండ్ వెల్నెస్, సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థలు జాబ్ మేళాలో పాల్గొంటాయి. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు తమ వెంట లేటెస్ట్ రెజ్యుమెలు తెచ్చుకోవలసి ఉంటుంది. మరిన్ని వివరాలకు హైదరాబాద్ దోమలగూడలోని నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రధాన కార్యాలయంలోని 040-40214215 నంబర్ కు కాల్ చేసి తెలుసుకోవచ్చు.

స్కిల్ డెవలప్ మెంట్ కాంటాక్ట్ నంబర్స్:

హైదరాబాద్ – అశోక్ నగర్ – 040 – 40214215
హైదారబాద్ – చార్మినార్  – 040-24410211
భువనగిరి – 08685244266
ఖమ్మం  – 08742234215
మహబూబ్ నగర్  –  08686793145
మంచిర్యాల  – 08736253535
నిర్మల్ – 08734244466
దిల్ సుఖ్ నగర్ – 040 – 24147555
కరీంనగర్ – 0878 – 6515666
నిజామాబాద్ – 08462240678
వనపర్తి – 09642435228
జహీరాబాద్ – 07451280822
నల్లగొండ – 08682247227
హన్మకొండ –  08702554333
సిద్దిపేట – 08457231234

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy