తెలంగాణ తొలి గవర్నర్ నరసింహన్..

narasimhan-owthతెలంగాణ తొలి గవర్నర్ గా ఇ.ఎస్.ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజ్ భవన్ లో వివిద రంగాలకు చెందిన ప్రముఖుల నడుమ జరిగింది. తెలంగాణ తొలి గవర్నర్ గా నరసింహన్ తో హైకోర్టు చీఫ్ జస్టిస్ కళ్యాణ్ జోతీ సేన్ గుప్తా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పటి వరకు సంయుక్త ఆంధ్ర ప్రదేశ్ కు గవర్నర్ గా ఉన్న నరసింహన్ ఇకనుండి రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరించనున్నారు. 2007లో ఛత్తీస్ ఘడ్ గవర్నర్ గా తొలిసారిగా బాధ్యతలు చేపట్టని నరసింహన్.. 2009 లో ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా నియమితులయ్యారు. గవర్నర్ నరసింహన్ హయాంలో రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఆ తర్వాత ప్రత్యేక పరిస్థితుల వల్ల రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా ఏర్పడటంతో రెండింటికీ నరసింహనే గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy