తెలంగాణ తొలి సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీగా అనురాగ్ శర్మ…

2014-06-01_18_Home_rajiv-sharmaకొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాజీవ్ శర్మ బాధ్యతలు చేపట్టారు. సెక్రటేరియట్ లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి మహంతి కాలం ముగియడంతో రాజీవ్ శర్మ పాలన పగ్గాలు చేపట్టారు. మరోవైపు తెలంగాణ తొలి ఇంచార్జ్ డీజీపీగా అనురాగ్ శర్మ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. 1982 బ్యాచ్ కు చెందిన రాజీవ్ శర్మ పలు కీలక శాఖల్లో బాధ్యతలు నిర్వహించారు. నిన్నటి వరకు డెప్యుటేషన్ పై కేంద్ర హోం శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన రాజీవ్ శర్మ రూర్కీలో ఐఐటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ చేశారు. అసిస్టెంట్ కలెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన రాజీవ్ శర్మ.. కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్ గా పనిచేశారు. హైదరాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీకి స్పెషల్ కమిషనర్ గానూ సేవలందించారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో కీలక భూమిక పోషించారు. శ్రీకృష్ణ కమిటీకి అవసరమైన సమాచారాన్ని అందించడమే కాక..కమిటీకి కార్యదర్శిగా వ్యవహరించారు. తెలంగాణ తొలి ఇంచార్జ్ డీజీపీగా అనురాగ్ శర్మ నియమితులయ్యారు. అనురాగ్ శర్మను డీజీపీగా నియమిస్తూ మాజీ సీఎస్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. 1982 బ్యాచ్ కు చెందిన అనురాగ్ శర్మ..సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ప్రస్తుతం హైదరాబాద్ సీటీ కమిషనర్ గా పనిచేస్తున్నారు. ఇవాళ ఉదయం తెలంగాణ ఇంచార్జ్ డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
మొత్తానికి తెలంగాణ తొలి ప్రభుత్వంలో సీఎస్, డీజీపీగా బాధ్యతలు స్వీకరించి రికార్డు సృష్టించారు రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy