తెలంగాణ బిల్లుకు ఆమోదం

12తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మరో మైలురాయి దాటింది. టీ బిల్లుపై కేంద్ర కేబినెట్ అమోద ముద్ర వేసింది. ప్రధాని నివాసంలో దాదాపు రెండు గంటల పాటు తెలంగాణ బిల్లుపై కసరత్తు చేసింది మంత్రిమండలి. సుదీర్ఘ చర్చ తర్వాత బిల్లుకు పచ్చ జెండా ఊపింది. దీంతో… విభజన ప్రక్రియ అసలు సిసలైన ఆఖరు దశకు చేరుకుంది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో తెలంగాణే ప్రధాన అజెండాగా ప్రత్యేక కేబినెట్ సమావేశం ఆద్యంతం వాడివేడిగా జరిగింది. టీ బిల్లు వివరాలను షిండే, జైరాంరమేష్ మిగతా మంత్రులకు వివరించారు. యూటీపై కేబినెట్ లో వాడివేడిగా వాదనలు జరిగినట్లు తెలుస్తోంది. సీమాంద్రకు చెందిన కావూరి, పళ్లం రాజు హైదరాబాద్ ను యూటీ చేయాలని ప్రతిపాదించగా, తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రి జైపాల్ రెడ్డి పూర్తిగా వ్యతిరేకించినట్లు సమాచారం. ఇక గవర్నర్ కు శాంతిభద్రతలను అప్పగించడంపై కేంద్ర మంత్రి శరద్ పవార్ అభ్యంతరం తెలిపారని టాక్. ప్రధానంగా సీమాంధ్ర ప్రాంతానికి ఆర్థిక సహయంపైనే ఎక్కువసేపు డిస్కషన్ జరిగినట్టు తెలిసింది.  ఆఖరుకు 32 అంశాల్లో సవరణలను మంత్రివర్గం ప్రతిపాదించి టీ బిల్లుకు జతచేసింది. పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపడం,…. రాయల సీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం మినహా ఇతర ఏ డిమాండ్లకు కేబినెట్ అంగీకరించలేదని తెలుస్తోంది. 12న టీ బిల్లును మొదట రాజ్యసభలో ప్రవేశ పెట్టి తర్వాత లోకసభకు పంపే ఛాన్స్ ఉంది.

కేబినెట్ భేటీకి ముందు .. బీజేపీతో కాంగ్రెస్ నేతలు మంతనాలు జరిపారు. వెంకయ్యనాయుడితో దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్ సమావేశమై… సవరణలపై డిస్కస్ చేశారు. మొత్తానికి పార్లమెంట్ లో టీ బిల్లుకు ఇబ్బందిరాకుండా.. అన్ని పార్టీలను కలుపుకుని పోయేలా కేంద్రం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. అడిగినవారిని కాదనకుండా.. మార్పులు చేర్పులు చేస్తోంది. అత్యంత సున్నితమైన సమస్యకు తెలివైన పరిష్కారం చూపించే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy