తెలంగాణ బిల్లుకు లైన్ క్లియర్

download
రాజ్యసభలో తెలంగాణ లైన్ క్లియర్ అయ్యింది. బిల్లుపై కొన్ని సవరణలకు బీజేపీ డిమాండ్ చేయడంతో ఆ పార్టీ నేతలతో ప్రధాని నిన్న భేటీ అయ్యారు. మళ్లీ ఇవాళ బిల్లుపై సవరణలకు కేంద్ర మంత్రి జైరాం రమేష్ బీజేపీ నేతలతో సమావేశమైయ్యారు. సవరణలపై బీజేపీ కాస్త వెనక్కి తగ్గడంతో ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ బిల్లును కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో పెట్టే అవకాశం ఉంది. ఇక బీజేపీ సవరణల గురించి ప్రధాని ప్రకటన చేసే అవకాశం ఉంది.

తెలంగాణ ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడవద్దని మధుయాష్కి కోరారు. ఈ రోజే తెలంగాణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. సోనియా కారణంగానే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందని మధుయాష్కి తెలిపారు. సవరణలపై బీజేపీ వెనక్కి తగ్గడంలో కేంద్ర మంత్రులు కీలక పాత్ర పోషించారు. ఇక అలాగే సీమాంధ్ర ప్యాకేజీ, ప్రత్యేక ప్రతిపత్తి గురించి కూడా ప్రధాని ప్రకటన చేస్తారని కాంగ్రెస్ వర్గాల సమాచారం.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy