తెలంగాణ బిల్లుపై చర్చ ప్రారంభం

lok
సభ్యుల ఆందోళనల మధ్యే కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లును చర్చకు అనుమతించాలని స్పీకర్ మీరాకుమార్ ను కోరారు. వాయిదా అనంతరం సభ ప్రార:బమైన వెంటనే సీమాంధ్ర ఎంపీలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. తమిళ జాలర్లకు న్యాయం చేయాలని కోరుతూ తమిళనాడు ఎంపీలు కూడా ఆందోళనకు దిగడంతో లోక్ సభ దద్ధరిల్లింది. తీవ్ర గందరగోళం మధ్య స్పీకర్ సభను 12.45 గంటలకు వాయిదా వేశారు. వాయిదా అనంతరం తిరిగి లోక్ సభ ప్రారంభమైనా మరలా రెండు నిమిషాలలో వాయిదా పడింది. మంత్రి షిండే తెలంగాణ గురించి మట్లాడుతుండగానే… స్పీకర్ మీరాకుమార్ సభను మధ్యాహ్నం మూడు గంటలకు వాయిదా వేశారు. చర్చలో భాగంగా తెలంగాణ డిమాండ్ ఇప్పటిది కాదన్నారు షిండే. తెలంగాణ ఏర్పాటు విస్తృతంగా చర్చలు జరిపామని ఆయన అన్నారు. ఆర్ధికంగా, సామాజికంగా తెలంగాణ వెనుకబడపోయిందని ఆయన చెప్పారు. అందరికీ సమస్యాయమే తమ లక్ష్యమన్నారు షిండే.

మరోవైపు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. సీమాంధ్ర ఎంపీలు ప్లకార్డులతో వెల్ లోకి దూసుకెళ్ళారు. నినాదాలతో సబను హోరెత్తించారు. దీంతో ఛైర్మన్ సభను మధ్యాహ్సం 2 గంటలకు వాయిదా వేశారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy