తెలంగాణ భాషను కాపాడుకోవాలి : కవిత

kavithakavisammelanam1తెలంగాణా భాష అంతరించిపోతున్న సందర్బంలో మనమంతా కలిసి కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ కవిత. జాగృతి కవితాంజలి శీర్షికను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో  రాష్ట్రంలోని 31 జిల్లాల్లో నిర్వహిస్తున్న కవి సమ్మేళనాల్లో భాగంగా శనివారం(ఆగస్టు-12) నిజామాబాద్  లో కవి సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎంపీ కవిత హాజరై మాట్లాడారు.

తెలంగాణలో కవులే లేరన్న సమయంలోనే అప్పటి గోల్కొండ పత్రిక సంపాదకులు, ప్రముఖ తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి యావత్తు తెలంగాణ అంతా సంచరించి 300ల పైచిలుకు కవులు, కవయిత్రులతో కూడిన గోల్కొండ కవుల ప్రత్యేక సంచికను వెలువరించి ఆంధ్రాపాలకులను విస్మయానికి గురిచేశారని గుర్తు చేశారు. అలాంటి సురవరం ప్రతాపరెడ్డిని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ జాగృతి ప్రతి ఇంటిని, గడప గడపనూ ఉన్న కవులను, కవయిత్రులను సేకరించి ఎంపిక చేయబడిన కవుల కవిత్వాలతో కూడిన తెలంగాణ ప్రత్యేక సంచికను త్వరలోనే తీసుకురానున్నామని తెలిపారు. తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యతను ఇచ్చి, ప్రపంచ తెలుగు మహాసభల్లో నిజామాబాద్ జిల్లాలోని కవులు, కవయిత్రులను తెలుగు పండితులందరినీ గుర్తించి ఘనంగా సన్మానిస్తామన్నారు. పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ కవి సమ్మేళనాలు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదయ్యే అవకాశం ఉందని, దానిని గిన్నిస్ బుక్‌లో ఎక్కేలా కృషిచేస్తామన్నారు ఎంపీ కవిత.

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy