అపర చాణక్యుడు పీవీ..!

narasimharaoదేశానికి ఆర్థిక సంస్కరణలు పరిచయం చేసిన ఘనుడు.. కొత్త ఆలోచనలతో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన ధీశాలి.. తెలంగాణలోని మారుమూల ప్రాంతం నుంచి ఢిల్లీ గద్దెనెక్కి చరిత్ర సృష్టించిన పీవీ నరసింహారావు జయంతి నేడు. రాజీవ్ గాంధీ మరణానంతరం.. మైనారిటీ లో ఉండి కూడా అయిదేళ్ల పాటు పాలన సాగించిన అపర చాణక్యుడాయన. ఆంధ్రప్రదేశ్ సీఎంగా, కేంద్ర హోం మంత్రిగా, రక్షణ, విదేశంగా మంత్రిగా ఏ పదవి చేపట్టినా.. పదవులకే వన్నె తెచ్చిన పాలనాదక్షుడు పీవీ. ఇంతటి ఘనత వహించిన పీవీ ని అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయి. ఆయనకు కనీస గౌరవం కూడా ఇవ్వలేదు.

పాముల పర్తి నరసింహారావు 1921 జూన్ 28న వరంగల్ జిల్లా లక్నేపల్లిలో జన్మించారు. కరీంనగర్ జిల్లాలో వంగరలో పెరిగిన ఆయన చిన్నప్పట్నుంచే ఆదర్శ భావాలతో ఎదిగారు. కాలేజీ రోజుల్లోనే వందేమాతరం ఉద్యమం వైపు ఆకర్శితులయ్యారు. స్వాతంత్ర్య పోరాటాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర వహించారు. ఆ తర్వాత 1971 సెప్టెంబర్ 30 నుంచి 1973 జనవరి 10 వరకు  ఆంధ్రప్రదేశ్ సీఎంగా వ్యవహరించారు. దేశంలోనే తొలిసారిగా భూ సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ తర్వాత కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ కూడా తనదైన ముద్ర వేశారు. 1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం ఏఐసీసీ బాధ్యతలు చేపట్టి.. ప్రధాని అయ్యారు. ఆర్థిక సంస్కరణలు తెచ్చీ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు. తెలంగాణ గడ్డపై పుట్టిన ఒక సామాన్యుడు.. అసామాన్యుడిగా ఎదిగిన తీరు ఆదర్శం.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy