తెలంగాణ రాజు సీఎం కేసీఆర్ : నారాయణమూర్తి

NRప్రపంచ తెలుగు మహాసభలు నాలుగోరాజు సోమవారం (డిసెంబర్-18) LB స్టేడియంలో తెలుగు సినీ ప్రహుఖుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడిన నటుడు ఆర్ నారాయణ మూర్తి మాటలు అక్కడ ఉన్నవారినందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. స్పీచ్ మొదలుపెడుతూ ముందుగా..వీర తెలంగాణ ముద్దుబిడ్డలారా..ప్రపంచ తెలుగు ముద్దు బిడ్డలారా మీ అందరికీ నమస్కారం అంటూ సభను ఒక్కసారిగా ఉర్రూతలూగించారు. కోట్లాది మంది చూస్తుండా మహానీయుడు తెలంగాణ రాజు సీఎం కేసీఆర్ శిరసు వంచి నమస్కారం చేస్తున్నానన్నారు.

తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్ కు , అథిరథ మహారథులకు నమస్కారం అంటూ ..మొదలె పెట్టారు నారాయణమూర్తి. పాశ్చత్య సాంప్రదాయాలు మన తెలుగును మంటకలుపుతున్నాయని, తెలుగు జాతిని మనం కాపాడుకునేందుకుకే ఈ ప్రపంచ తెలుగు మహాసభలు కేసీఆర్ జరుపుతున్నారన్నారు. హబ్, లు పబ్బులు క్లబ్బులను మూసేయాలని కోరుతున్నాం. భారతదేశంలో భాష అంటే తెలుగేనని, తమిళనాడును చూసి మనం నేర్చుకోవాలన్నారు పీపుల్స్ స్టార్. సౌత్ ఇండియా నుంచి తెలుగును కాపాడే నాయకుడు కావాలని అది ఒక్క కేసీఆర్ మాత్రమేనని సభాముఖంగా తెలుపుతున్నట్లు చెప్పారు. అన్నగారు ఎన్టీఆర్ అంటే ప్రతిపక్షాలకు గడగడ అని, అలాంటి గట్స్ ఉన్న నాయకుడు మన ప్రస్తుత కేటీ రామారావు అన్నారు. తెలంగాణ కోసం ఎత్తుకుపై ఎతులు వేసి తెలంగాణ తెచ్చిన ఘనుడు ఒక్క కేసీఆరే అన్నారు నారాయణమూర్తి. తెలుగు బిడ్డ వెంకయ్యనాడు ఉపరాష్ట్రపతి అయ్యారన్నారు. తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటాలన్నారు. తెలుగు నేర్చిన వారు ఇంటర్నేషనల్ లెవల్ ఉద్యోగాలు వచ్చినప్పుడు తెలుగుకు న్యాయం చేసినవాళ్లం అవుతామన్నారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy