తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

TELANGANAతెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు అంతా సిద్ధమైంది. నాలుగేళ్ల తెలంగాణ రాష్ట్ర అవతరణ సంబురాలను ఊరువాడా ఘనంగా నిర్వహిస్తుంది ప్రభుత్వం. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా వందనం నిర్వహించనున్నారు. హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు జెండా ఎగురవేయనున్నారు. శనివారం (జూన్-2) ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్….అసెంబ్లీ ముందున్న గన్ పార్క్ లో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పిస్తారు. తర్వాత బేగంపేటలోని పోలీస్ అమరవీరుల స్థూపం దగ్గర శ్రద్ధాంజలి ఘటిస్తారు.

10 గంటల 25 నిమిషాలకు పరేడ్ గ్రౌండ్ కు చేరుకుంటారు సీఎం. పదిన్నరకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. 13 నిమిషాల పాటు పోలీస్ మార్చ్ పాస్ట్ ఉండనుంది. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన అధికారులకు బహుమతుల ప్రదానం చేయనున్నారు సీఎం. తర్వాత 11 గంటలకు నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరించనున్నారు ముఖ్యమంత్రి. అవతరణ వేడుకల సందర్భంగా భాగ్యనగరాన్ని అందంగా అలంకరించారు. చారిత్రక కట్టడాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ రవీంద్రభారతి, పీపుల్స్ ప్లాజా, లుంబినీ పార్క్ లలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. రేపు సాయంత్రం లుంబిని పార్క్ నుంచి.. పీపుల్స్ ప్లాజా వరకు వెయ్యి మంది కళాకారులతో…కల్చరల్ కార్నివాల్ జరగనుంది. బైసన్ పోలో గ్రౌండ్స్ లో 3 రోజుల పాటు పారామోటరింగ్ నిర్వహించనున్నారు. అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర  ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy