తెలంగాణ రైతులకు గొప్ప వరం : పోచారం

pocharamపంట పెట్టుబడి పథకం కింద రైతులందరికీ ఎకరానికి రూ. 4 వేల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి. తెలంగాణ రైతులకు ఇది గొప్ప వరమన్నారు ఆయన. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పంట పెట్టుబడి పథకంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈ సమాధానం ఇచ్చారు. వానకాలం పంటకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి, యాసంగి పంటకు నవంబర్ నుంచి పంట పెట్టుబడి సాయం చేస్తామన్నారు మంత్రి. ప్రతి గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా రైతులకు చెక్కుల పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ. 12 వేల కోట్లు ప్రతిపాదించడం జరిగిందని ఆయన వివరించారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 72 లక్షల 13 వేల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు శ్రీనివాస్‌రెడ్డి. దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా కూడా ఈ పథకం లేదన్నారు. రైతు వద్ద శిస్తు వసూలు చేయకుండా పంట పెట్టుబడి పథకం అమలు చేస్తున్నాం.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy