తెలిస్తే ఎగ్జిట్ అవుతారు : సోషల్ గ్రూప్స్ కంట్రోల్ కు కండీషన్స్

social-media-sitesవాట్సప్, ఫేస్ బుక్ తో పాటు ఇతర గ్రూపులను కట్టడి చేసే పనిలో పడ్డారు పోలీసులు. గ్రూపుల ద్వారా అసభ్యకర,తప్పుడు సమాచారాలు రాకుండా చర్యలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే వాట్సప్ లో వివాదాస్పద పోస్టులు రాకుండా.. ఆయా గ్రూపుల అడ్మిన్లను కూడా బాధ్యులను చేస్తున్నారు. అలాంటి పోస్టులు చేసిన సభ్యులతో పాటు గ్రూప్ క్రియేట్ చేసిన అడ్మిన్లకు మూడు నుంచి ఐదేళ్ళ  జైల్ శిక్ష తప్పదంటున్నారు.

అయితే గ్రూప్ క్రియేట్ చేయాలనుకునే అడ్మిన్లు ముందుగా తీసుకోవాల్సిన బాధ్యతలు.. జాగ్రత్తకు సంబంధించిన నోటీసులను విడుదల చేశారు ఉత్తరప్రదేశ్ లక్నో పోలీసులు. వాట్సాప్, ఫేస్ బుక్ గ్రూప్ అడ్మిన్లకు సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నోటీసులు జారీ చేశారు వారణాసి కలెక్టర్, ఎస్పీ. ఈ సమాచారాన్ని కూడా విస్త్రుతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. జాతీయ స్థాయిలో వైరల్ అవుతోంది.

గ్రూప్ అడ్మిన్ బాధ్యతలు

… వాట్సప్, ఫేస్ బుక్ గ్రూప్ అడ్మిన్ పరిపక్వతతో ఆలోచించగలిగినవాడై ఉండాలి. గ్రూప్ లో ప్రతి పోస్ట్ కీ బాధ్యత తీసుకోవాలి.

… గ్రూప్ లో యాడ్ చేసే ప్రతి సభ్యుడూ అడ్మిన్ కు తెలిసి ఉండాలి

… ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే.. వెంటనే గ్రూప్ నుంచి తొలగించాలి

… సభ్యుడి అసభ్య సమాచారం, తప్పుడు వార్త, వదంతులపై స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి

… వివాదాస్పద పోస్టింగ్ కి సంబంధించి అడ్మిన్ ఎలాంటి చర్యలు తీసుకోకుంటే.. అతనిపై పోలీసులు చర్యలు తీసుకుంటారు.

… అడ్మినే వివాదాస్పద పోస్టుచేస్తే ఐటీ చట్టం, ఐపీసీ సెక్షన్ 153ఎ కింద శిక్ష విధిస్తారు. 3 నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

… వివాదాస్పద వ్యక్తులను గ్రూప్ లో చేర్చుకోకూడదు

… వివాదాస్పద పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి

… ట్వీట్ చేసిన  సభ్యులను వెంటనే తొలగించాలి. గ్రూప్ నిబంధనలు పెట్టుకుని అందరూ పాటించాలి

… గ్రూప్ లో షేర్ అవుతున్న అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy