తెలుగు ఆత్మగౌరవ ప్రతీక దూరమై 20ఏళ్లు

sr-ntr-seniorతెలుగు ప్రజలు ఆప్యాయంగా పిలుచుకునే అన్నగారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అన్న గొప్ప నాయకుడు. నటుడిగా, రాజకీయ నేతగా అశేష అభిమానుల్ని సంపాదించుకున్న వ్యక్తి. అధికారం ప్రజా సేవకే అని గుండెల నిండా నమ్మిన ఎన్టీఆర్ 20వ వర్థంతి ఇవాళ….

తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్. ఓ సినిమా నటుడిగా ప్రస్తానం ప్రారంభించిన ఎన్టీఆర్  లక్షలాది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఎన్టీఆర్  వేసిన ఎన్నో పాత్రలు ఆయన్ను   అందరివాడుగా మార్చాయి. పౌరాణిక పాత్రలకు ప్రాణం పోయగలిగిన ఒకే ఒక్క నటుడు ఎన్టీఆర్ అన్న పేరు తెచ్చిపెట్టాయి.  రాముడు, కృష్ణుడు అంటే తెలుగు ప్రజలకు గుర్తొచ్చే నిలువెత్తు స్వరూపమే ఎన్టీఆర్. అందుకే తెలుగు ప్రజలంతా ఆయన్ను అన్నగారిగా పిలుస్తారు.

నటుడిగా, దర్శకుడిగానూ ఎన్టీఆర్ సక్సెస్ అయ్యారు. ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయమన్న నాయకుడు ఎన్టీఆర్. తెలుగు జాతి ఆత్మగౌరవం అంటూ తెలుగు దేశం స్థాపించారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి అప్పట్లో ప్రభంజనం సృష్టించారు. నేషనల్ ఫ్రంట్ పేరుతో కాంగ్రెస్ వ్యతిరేక శక్తుల్ని ఏకం చేసి తెలుగు వాడి పేరును ఢిల్లీ గల్లీల్లో మార్మోగేలా చేశారు.

అధికారంలోకి వచ్చాక కేవలం రూపాయి జీతం తీసుకుంటూ ప్రజారంజక పాలన చేశాడు ఎన్టీఆర్. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టారు. తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. మహిళలకు ఆస్థిలో భాగస్వామ్యం కల్పించారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, జనతా వస్త్రాలు అందించారు. మూడోసారి సీఎం అయిన తర్వాత జరిగిన నాటకీయ పరిణామాల మధ్య పదవిని కోల్పోయారు ఎన్టీఆర్ … ఆ తర్వాత కొంతకాలానికే గుండెపోటుతో చనిపోయారు. నిత్యం ప్రజలకోసం తపించిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన భౌతికంగా దూరమై 20ఏళ్లవుతున్నా.. తెలుగు ప్రజల గుండెళ్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy