తెలుగు ‘బిగ్‌బాస్‌ 2’ వంద రోజులు

bigboosబిగ్‌బాస్‌ షో దక్షిణాదిలో ఘన విజయం సాధించింది. ఈ షో తెలుగు వర్షన్‌ మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌  హోస్టుగా వ్యవహరించగా… బిగ్‌బాస్ 2 రియాలిటీ షోకు న్యాచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. తొలి సీజన్‌కు మంచి రెస్పాన్స్‌ రావటంతో రెండో సీజన్‌ను మరింత భారీగా ప్లాన్‌చేస్తున్నారు నిర్వాహకులు. సీజన్ 2 కోసం అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా సెట్‌ను కూడా వేస్తున్నారు. అంతేకాదు.. రెండవ సీజన్‌ను 100 రోజుల పాటు నిర్వహించనున్నారట. జూన్‌ 10 నుంచి రెండో సీజన్‌ షూటింగ్ ప్రారంభం కానుంది.

బిగ్‌బాస్ 2 ప్రాజెక్టుకు నాని భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది. నానికి బిగ్‌బాస్ 2 మేకర్స్ రూ.4 కోట్లు రెమ్యునరేషన్ ఫైనల్ చేశారన్న వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy