తెలుగు మహాసభలు : తెలంగాణ వైభవాన్ని ఘనంగా చాటుదాం

24174179_710010942537094_8417842365420784849_nప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లల్లో బిజీగా ఉంది సర్కార్. సమావేశాల నిర్వహణలో ఎక్కడా ఏ లోటు రాకుండా జాగ్రత్త పడాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. ప్రారంభోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా వస్తున్నారని చెప్పారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, గవర్నర్ నరసింహన్ విశిష్ట అతిథులుగా వస్తారన్నారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ వస్తున్నారని చెప్పారు కేసీఆర్. సోమవారం (డిసెంబర్-11) ప్రగతి భవన్ లో తెలుగు మహాసభల ఏర్పాట్లపై సమీక్ష చేశారు సీఎం. సమావేశాల సన్నాహక కార్యక్రమాలపై.. సాహిత్య అకాడమీ చైర్మన్, ఇతర నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు సీఎం. ఏయే దేశాలు, రాష్ట్రాల నుంచి ఎంతమంది ప్రతినిధులు వస్తున్నారని అడిగారు. మొత్తం 8వేల మంది హాజరవుతున్నట్లు సీఎంకు చెప్పారు నిర్వాహకులు. ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియంతో పాటు మిగిలిన అన్ని వేదికల పర్యవేక్షణ బాధ్యత ఒక్కొక్కరు తీసుకోవాలని సూచించారు. వేదికల దగ్గర జరిగే కార్యక్రమాలకు హాజరయ్యే ప్రతినిధుల కోసం రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. సాయంత్రం ఎల్బీస్టేడియంలో జరిగే కార్యక్రమాలకు.. ఒక గంట ముందుగానే ఇతర వేదికల దగ్గర కార్యక్రమాలు అయిపోవాలన్నారు సీఎం.

ఎల్బీస్టేడియం దగ్గర ప్రతిరోజు తెలంగాణపై ప్రత్యేకంగా రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించాలన్నారు సీఎం. సాహిత్య కార్యక్రమాలు, కళాకారుల పరిచయాలు జరగాలన్నారు. పార్కింగ్ కు ఇబ్బంది రాకుండా చూసుకోవాలన్నారు. సమావేశాల ప్రారంభం నాటి నుంచి ఫుడ్ కోర్ట్స్ ఏర్పాటు చేయాలని సూచించారు ముఖ్యమంత్రి. సాంస్కృతిక కార్యక్రమాల్లో తెలంగాణ వైభవాన్ని ఘనంగా చాటి చెప్పాలని, ఐదు రోజుల్లో ఒకనాడు పూర్తిగా సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించాలని సీఎం సూచించారు.

వివిధ జిల్లాల నుంచి వచ్చే తెలుగు టీచర్లు, లెక్చరర్లకు రచయితల సంఘాల సభ్యులకు.. జిల్లా కలెక్టర్లు రవాణా, భోజన సౌకర్యం కలిపించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. ప్రపంచ తెలుగు మహాసభలకు అందరూ ఆహ్వానితులే అన్న ప్రాతిపదికన సభలు నిర్వహించాలన్నారు. మహిళలకు ఒక ప్రత్యేకమైన ఎన్ క్లోజర్ ఉండాలన్నారు. సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనే వారికి మరో ఎన్ క్లోజర్ ఉండాలని ఆదేశించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఒక ఎన్ క్లోజర్ వుండాలని సూచించారు. జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీతలను ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించాలన్నారు ముఖ్యమంత్రి. ఇతరభాషల వారికి సన్మానం చేశామన్న కీర్తి తెలుగు మహాసభల సందర్భంగా మనకు దక్కాలన్నారు సీఎం.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy