తెలుగు మహాసభలు : సాహీతీవేత్తల ఫొటోలతో స్వాగత తోరణాలు

TELUGU PHOడిసెంబర్ 15 నుంచి 19 వరకు హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి జరుగుతున్న సభలకు భారీ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. తెలంగాణ సంస్కృతీ ప్రముఖుల పేరుతో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తోంది. నగరాన్ని ఆనుకుని ఉన్న జాతీయ రహదారులతోపాటు గ్రేటర్ హైదరాబాద్‌వ్యాప్తంగా స్వాగత తోరణాలను ఏర్పాటుచేస్తున్నారు. ఇందుకోసం 90 ప్రాంతాలను ఎంపికచేశారు. సభలతో కొత్త రయితలు, రచనలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కమిటీలను ఏర్పాటుచేశారు. భాషా సదస్సుల కమిటీ, గేయతత్వ, అవధాన, మహిళా సాహిత్య, బాలసాహిత్య, చరిత్ర కమిటీలను ఏర్పాటుచేసినట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు.

మహిళా సాహిత్య కమిటీ
పోల్కంపల్లి శాంతాదేవి, ఆచార్య సూర్య ధనుంజయ్, జూపాక సుభద్ర, అనిశెట్టి రజిత, ఆచార్య వేలూరి శ్రీదేవి, ఆచార్య కడిమిళ్ల లావణ్య, ఆచార్య త్రివేణి, షాజహానా, జ్వలిత, చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ, బండారు సుజాతాశేఖర్, నెల్లుట్ల రమాదేవి, కొండపల్లి నీహారిణి.

బాలసాహిత్య కమిటీ
ఎం చిత్తరంజన్, ఐతా చంద్రయ్య, వేదాంతం సూరి, వాసాల నర్సయ్య, పత్తిపాక మోహన్, వేదకుమార్, దాసరి వెంకటరమణ, వీఆర్ శర్మ.

భాషా సదస్సుల కమిటీ
ఆచార్య రవ్వా శ్రీహరి, కపిలవాయి లింగమూర్తి, కే రామచంద్రమూర్తి, అల్లం నారాయణ, కే శ్రీనివాస్, కట్టా శేఖర్‌రెడ్డి, వర్దెల్లి మురళి, డాక్టర్ నలిమెల భాస్కర్, డాక్టర్ మలయశ్రీ. డాక్టర్ వెలిచాల కొండల్‌రావు.

చరిత్ర కమిటీ
ఘంటా చక్రపాణి, డాక్టర్ డీ రాజిరెడ్డి, ద్యావనపల్లి సత్యనారాయణ, హరగోపాల్, కుర్రా జితేంద్రబాబు, కావూరి శ్రీనివాస్, మల్లేపల్లి లక్ష్మయ్య.

గేయతత్వ కీర్తనల కమిటీ
తిరుమల శ్రీనివాసాచార్య, పీ భాస్కరయోగి, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్‌తేజ, చంద్రబోస్, కందికొండ యాదగిరి, చెన్నకేశవరెడ్డి, వడ్డేపల్లి కృష్ణ, వారిజారాణి, శ్రేష్ఠ.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy