తెలుగు మహాసభల కోసం 500 బస్సులు

1641_TSRTCతెలుగు మహాసభలను ఈ నెల 15న సాయంత్రం 6గంటలకు ఉపరాష్ట్రపతి ప్రారంభిస్తారని సీఎస్ ఎస్పీ సింగ్ తెలిపారు. తెలుగు మహాసభల ఏర్పాట్లపై సీఎస్ అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం (డిసెంబర్-12) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రారంభ, ముగింపు వేడుకల్లో జిల్లాల నుంచి హాజరయ్యే వారికోసం స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎస్.

ప్రపంచ తెలుగు మహాసభల కోసం 500 నుంచి 550 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. సిద్దిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ గ్రామీణ, కరీంనగర్ జిల్లాల నుంచి 30 చొప్పున బస్సులు, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, జనగామ జిల్లాల నుంచి 20 చొప్పున బస్సులు, నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి 20 చొప్పున బస్సులు, కామారెడ్డి నుంచి 15, వికారాబాద్, ఖమ్మం నుంచి 10, మిగతా జిల్లాల నుంచి 5 చొప్పున బస్సులు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎస్ ఎస్పీ సింగ్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy