తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు

sun32భానుడి భగభగలతో తెలుగు రాష్ట్రాలు హీటెక్కిపోతున్నాయి. వింటర్ లోనూ సమ్మర్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రుతుపవనాలు మొహం చాటేయడంతో కష్టాలు తప్పడం లేదు. పగటి పూట అగ్నిగోళంలా మండిపోతున్నాడు సూర్యుడు.

సీజన్ ఏదైనా సీన్ మాత్రం ఒక్కటే. సమ్మర్, వింటర్ తేడా లేదు. పట్టపగలు చుక్కలు చూపిస్తున్నాడు సూరీడు. నడినెత్తికొచ్చి సుర్రుమంటున్నాడు. భగభగా మండిపోతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు అంతకంతా పెరుగుతున్నాయి. సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీలు అధికంగా టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి. ఆల్రెడీ 2015 హాట్టెస్ట్ ఇయర్ గా 135 ఏళ్ల రికార్డ్ ను బ్రేక్ చేసింది.

తెలుగురాష్ట్రాల్లో నిన్న రికార్డైన టెంపరేచర్స్ అందర్నీ భయపెడుతున్నాయి. సాధారణంగా కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్, రామగుండంలో 2 నుంచి 3 డిగ్రీల అదనపు టెంపరేచర్ రికార్డ్ అయ్యింది. నిజామాబాద్ లో సాధారణం కంటే 6 డిగ్రీలు నమోదవగా.. అటు ఏపీలోనూ ఇదే పరిస్థితి. టెంపరేచర్స్ అధికంగా రికార్డ్ అవుతున్నాయి. ఈనెలాఖరు వరకు పరిస్థితి ఇలాగే ఉండవచ్చంటున్నారు వెందర్ ఎక్స్ పర్ట్స్.

దేశం నుంచి నైరుతి రుతుపవనాలు వెళ్లి ఈశాన్య గాలులు వీస్తున్నా ఆ ప్రభావం మాత్రం పెద్దగా కనిపించడం లేదు. బంగాళఖాతం, అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం, అల్పపీడనాల జాడే లేదు. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో వాయుగుండాలు, తుఫాన్లు ఏర్పడతున్నా.. ఇవి బంగాళాఖాతం వరకు రాకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడటం లేదంటున్నారు వాతావరణ నిపుణులు..

వింటర్ సీజన్ ప్రారంభమైనా భానుడు మాత్రం తగ్గడం లేదు. మంటపెంచేస్తున్నాడు. ఓ పక్క పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా.. రాత్రిపూట కూల్ వెదర్ కనిపిస్తోంది. నెమ్మదిగా చలిపులి పంజా విసిరేందుకు రెడీ అవుతోంది. ఒకే సారి రెండు రకాల వెదర్ ఎఫెక్ట్స్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy