తెలుగు వస్తేనే ఉద్యోగం వచ్చేలా కేసీఆర్ చేయాలి: వెంకయ్య

2024_venkaiah-naidu-lfరాజమౌళికి అక్కినేని జాతీయ అవార్డు రావడం సంతోషదాయకమన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. అవార్డుకు తాను అర్హున్ని కాదంటున్నాడని.. రాజమౌళి దానికి సరైన వ్యక్తని తెలిపారు. సన్మానాలు, అవార్డులు.. ఇతరుల్లో స్ఫూర్తినిస్తాయని తెలిపారు. దూరదృష్టితో ఏఎన్నార్ అవార్డును ఏర్పాటు చేశారన్నారు వెంకయ్య. నిబంధనలు…అడ్డొస్తున్నా… ఈ కార్యక్రమానికి వచ్చానన్నారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇదొక అపూర్వమైన రోజని అన్నారు. చూడగలగడం, వినగలగడం, స్పర్శ, రుచి, భావించడం, నవ్వడం, ప్రేమించడం.. ఇవే ప్రపంచంలో అద్భుతాలని ఓ వాట్సప్ మెసేజ్ గురించి వివరించారు. వీటన్నింటినీ… మహాద్భుతంగా చూపించగలిగింది.. సినిమా మాత్రమే అన్నారు వెంకయ్య. అసమాన ప్రతిభా విశేషాలు ఉన్న వ్యక్తి… రాజమౌళి అని ప్రశంసించారు. తెలుగు సినిమా ప్రమాణాలు, నాణ్యత పెరిగాయన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ను అభినందించారు వెంకయ్య. తెలుగును తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. మాతృభాష మాధుర్యాన్ని అనుభవిస్తేగానీ తెలియదన్నారు. భాషను కాపాడుకోవాలని… తెలుగు వస్తేనే ఉద్యోగం వచ్చేలా కేసీఆర్… చేస్తే బాగుంటుందని అభిలషించారు. ఆ వైపుగా ఆలోచిస్తారని అనుకుంటున్నా అన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy