తెలుగు సహా 9 భారతీయ భాషల్లో గూగుల్ సేఫ్టీ సెంటర్ గైడ్ లైన్స్

ఢిల్లీ : సేఫ్టీ సెంటర్ సేవలను మరింత విస్తరించింది గూగుల్ సంస్థ. తొమ్మిది భారతీయ భాషల్లో సేఫ్టీ సెంటర్ సేవలు అందించబోతోంది. ఆన్ లైన్ పై ఉన్న యూజర్ కు సేఫ్టీ, సెక్యూరిటీని అందించడమే సేఫ్టీ సెంటర్ చేసే పని. ఇంటర్నెట్ పై ఉన్న యూజర్లు , వారి కుటుంబసభ్యులు, వారి స్నేహితులు.. ఇలా అందరి డేటాను భద్రంగా ఉంచేందుకు సేఫ్టీ సెంటర్ పనిచేస్తుంది. తెలుగుతో పాటు.. హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళ్, ఉర్దూ.. ఇలా 9 భాషల్లో సేఫ్టీ సెంటర్ తన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. టెక్నాలజీని ప్రతిఒక్కరి దగ్గరకు చేర్చడం లక్ష్యంగా పెట్టుకున్న గూగుల్… ప్రతి యూజర్ డేటాకు ప్రొటెక్షన్ ఇవ్వడం తమ కర్తవ్యం అని చెబుతోంది.

ఇంటర్నెట్ పై ఫ్యామిలీ- ఫ్రెండ్లీ వాతావరణం క్రియేట్ చేయడానికి యూజర్లకు అవసరమైన సలహాలు, భద్రతాపరమైన సూచనలను ప్రాంతీయ భాషల్లోనే అందిస్తామని గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది. గూగుల్ సేఫ్టీ సెంటర్ లో విస్తృతమైన టూల్స్, రీసోర్సెస్ ఉంటాయని కంపెనీ తెలిపింది. డేటా సెక్యూరిటీ, ప్రైవసీ కంట్రోల్స్ లాంటి కీలకమైన అంశాలపై బేసిక్ సెక్యూరిటీ గైడ్ లైన్స్ తో పాటు.. తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఉంటాయని వివరించింది. ఇంటర్నెట్ ను ఉపయోగించే ప్రతి యూజర్ కు మరింతగా వీటిపై అవగాహన పెంచేందుకు, వారి డేటా భద్రంగా ఉంటుందని భరోసా ఇచ్చేందుకు.. ప్రాంతీయ భాషల్లో తమ సేవలను అందిస్తామని గూగుల్ సేఫ్టీ సెంటర్ చెబుతోంది.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy