తేనెటీగల దాడిలో వెటర్నరీ డాక్టర్ మృతి

bees-attackతేనెటీగల దాడిలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండల పశువైద్యాధికారి చింతలపూడి మల్లేశ్(39) చనిపోయారు. గురువారం ఉదయం మండలంలోని నగరంపల్లిలో పశువైద్యశిబిరం ఏర్పాటు చేయగా, పశువైద్యాధికారి మల్లేశ్ టూవీలర్ పై బయలుదేరాడు. ఈ క్రమంలో ఊర చెరువు మత్తడి వంతెన సమీపంలో మర్రిచెట్టుపైనున్న తెనెటీగలు మల్లేశ్ పై దాడిచేశాయి. దీంతో తన వాహనాన్ని వంతెన అవతలివైపు నిలిపి హాహాకారాలు చేస్తూ పరుగెత్తి పడిపోయాడు. తేనెటీగలు తీవ్రంగా గాయపరచడంతో అక్కడికక్కడే మృతిచెందాడు మల్లేశ్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy