తొలి అడుగు పడింది : సుప్రియ అధ్యక్షతన క్యాష్ కమిటీ

filchamberక్యాస్టింగ్ కౌచ్, వర్మ వ్యవహారంపై ఫిలిం ఇండస్ట్రీలోని పెద్దల సమావేశం ముగిసింది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో దాదాపు రెండు గంటలపాటు సమావేశం నిర్వహించారు. క్యాస్టింగ్‌ కౌచ్‌, సినీ ఇండస్ట్రీలో ఏర్పడిన సమస్యలపై చర్చించారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివాదాల పరిష్కారం కోసం 24 విభాగాల  ప్రతినిధులతో సమావేశమైన ఇండస్ట్రీ పెద్దలు.. సుప్రీయ కన్వీనర్ గా జాయింట్ యాక్షన్ కమిటీని నియమించారు.

ఈ కమిటీలో 24 విభాగాలకు చెందిన ప్రెసిడెంట్లు, సెక్రటరీలు సభ్యులుగా ఉండనున్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన ఏ నిర్ణయమైన ఈ కమిటీ ఫైనల్ చేయనుంది. మరోవైపు క్యాష్ కమిటీ ప్రాసెస్ కూడా జరుగుతున్నట్లు తెలిపారు. ఇందులో కూడా మొత్తం 21 మంది సభ్యులుగా ఉండనున్నారు. అయితే ఈ కమిటీలో సగం మంది ప్రజా సంఘాల నేతలు, లాయర్లు ఉంటారని తెలిపారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy