తొలి రోజు 1389 గ్రామాల్లో భూ సర్వే

trsసర్కార్ చేపట్టిన రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కొనసాగుతుంది. 90 రోజుల్లో 10 వేల 733 గ్రామాల్లో భూ సర్వే చేయనున్నారు అధికారులు. ప్రక్షాళన పూర్తయిన తరువాత రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. తొలి రోజు 1389 గ్రామాలలో భూ సర్వే అధికారులు పాల్గొన్నారు. రైతులకు పత్రాలు పంపిణీ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా సర్కార్ చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన మొదలైంది. మొన్నటి వరకు రైతు సమన్వయ సమితులు, రెవెన్యూ రికార్డుల మీద అవగాహన కల్పించిన మంత్రులు, అధికారులు…నిన్న భూ సర్వేలో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా గొల్లపల్లిలో రికార్డుల ప్రక్షాళన ప్రారంభించిన మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి…భూముల అమ్మకం, కొనుగోలు, వారసత్వ భూములకు సంబంధించిన రికార్ఢులను ప్రక్షాళన చేసి వివాదాలకు ముగింపు పలుకుతామన్నారు. కరీంనగర్ జిల్లా సిర్శపల్లి లో  భూ రికార్డుల  ప్రక్షాళనను ప్రారంభించారు మంత్రి ఈటల రాజేందర్ రెడ్డి.  ఆదిలాబాద్ జిల్లా కొత్తూర్ లో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు మంత్రి జోగు రామన్న.

డిసెంబర్ 15 వరకు మొత్తం 90 రోజులు రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనను పూర్తి చేయనున్నారు అధికారులు. చివరి రోజు గ్రామ సభ ఏర్పాటు చేసి ఎవరికి ఎంత భూమి ఉంది అనేది అధికారులు ప్రకటిస్తారు. ప్రక్షాళన పూర్తయిన తరువాత పాస్ పోర్ట్ సైజు లో పాస్ పుస్తకం రైతులకు ఇస్తారు. భూ సర్వేలో VRO నుంచి జిల్లా రెవెన్యూ అధికారి వరకు అందరు పాల్గొంటున్నారని చెప్పారు అధికారులు.  భూ సర్వేకు రైతులు సహకరించాలని కోరుతున్నారు అధికారులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy