తొలి వన్డేలో ధోనీ వరల్డ్ రికార్డు

DHONIవన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం (డిసెంబర్-10) హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో 65 పరుగులు చేసిన ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లో 16వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో కీపర్‌గా రికార్డులకెక్కాడు. శ్రీలంక మాజీ కెప్టెన్, కీపర్ కుమార సంగక్కర తొలుత ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత ఇన్నాళ్లకు ధోనీ 16వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఆటగాళ్లలో ధోనీ ఆరో ఆటగాడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ తర్వాతి స్థానాన్ని ధోనీ ఆక్రమించాడు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy