తొలి వన్డే ఫసక్.. రోహిత్ వీరోచిత సెంచరీ వృథా

ఇద్దరే ఆడారు. మనోళ్లు కేవలం ఇద్దరే మంచిగా ఆడారు. టెస్ట్ లకు… వన్డేలకు పూర్తి విరుద్ధమైన ఆట తీరుచూపించింది భారత్. ఇండియాలో కన్నబిడ్డను చూసుకుని… తిరిగి ఆస్ట్రేలియా టూర్ లో జట్టులో చేరిన రోహిత్ శర్మ ఖతర్నాక్ సెంచరీతో దుమ్ములేపాడు. ధోనీ(51)తో కలిసి ఇండియా పరువు నిలిపాడు. ఓటమి ముందే కన్ ఫామ్ అయిపోయిన మ్యాచ్ లో… కనీసం ఇండియా పోరాడి ఓడిందన్న లుక్ తెప్పించాడు. మిగతా ఆటగాళ్లందరూ ఘోరంగా ఫెయిల్ కావడంతో… వన్డే సిరీస్ ను భారత్ ఓటమితో మొదలుపెట్టింది.

టెస్ట్ సిరీస్ పోగొట్టుకున్న ఆస్ట్రేలియా కమ్ బ్యాక్ ఆటతీరు చూపించింది. సిడ్నీలో ఇండియాతో జరిగిన తొలి వన్డేలో సూపర్ విక్టరీకొట్టింది. భారత్ పై 34 రన్స్ తేడాతో లోకల్ టీమ్ గెలిచింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా… 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 288 రన్స్ చేసింది. హ్యాండ్స్ కోంబ్ 73, మార్ష్ 54 రన్స్ చేశారు. స్లాగ్ ఓవర్లలో బౌలర్లు ఇచ్చిన ఎక్కువ పరుగులే ఇండియా కొంప ముంచాయి.

289 రన్స్ తో చేజింగ్ మొదలుపెట్టిన ఇండియా.. టపటపా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ధావ్ డకౌట్. కోహ్లీ 3 రన్స్. రాయుడు డకౌట్. ఇన్నింగ్స్ 4 రన్స్ కే 3 వికెట్లు డౌన్. ఈ దశలో ఇండియా పనైపోయింది అనుకున్నారంతా. మరో ఎండ్ లో ఉన్న రోహిత్ శర్మకు.. ధోనీ జత కలిశాక పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇద్దరూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. హాఫ్ సెంచరీ చేసిన ధోనీ.. వన్డేల్లో పదివేల పరుగులు మైలురాయి కూడా దాటాడు. ఆ తర్వాత ధోనీ ఔటైనా… మిడిలార్డర్ తో రోహిత్ శర్మ లాక్కొచ్చాడు. అప్పటికే సెంచరీ చేసి.. భారీ షాట్లతో ఊపుమీదున్న రోహిత్ శర్మ… ఇంకో ఐదు ఓవర్లలో అరవై రన్స్ చేయాల్సిన దశలోనూ కొన్ని ఆశలు రేపాడు. ఐతే… 45.4 ఓవర్లలో ఇండియా స్కోర్ 221 దగ్గర ఉన్నప్పుడు ఏడో వికెట్ గా రోహిత్ శర్మ(129 బాల్స్ లో 133, 10ఫోర్లు, 6 సిక్సులు) వెనుదిరగడంతో.. ఇండియా ఓటమి ఖాయమైంది. మిణుకుమిణుకుమన్న ఆశలు ఆవిరయ్యాయి.  ఆ తర్వాత దినేష్ కార్తీక్(12), జడేజా(8), భువనేశ్వర్ కుమార్(29 నాటౌట్), కులదీప్ యాదవ్(3), షమీ(1) ఔటయ్యారు.

ఇండియా ఓడిపోయినా.. తన ఆటతీరుతో రోహిత్ శర్మ అదుర్స్ అనిపించాడు. మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉన్న వన్డే సిరీస్ ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 4 వికెట్లు పడగొట్టిన కంగారూ బౌలర్ రిచర్డ్ సన్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy