త్రివిక్రమ్ గుండమ్మకథ డ్రీమ్ క్యాస్ట్ – పార్ట్ 1

cinima titlesగుండమ్మ కథ.. నాటికీ.. నేటికీ.. రేపటికీ కాదు.. సినిమా అన్నది బతికి ఉన్నంత వరకు తరాలు మారినా ఒక్కసారైనా చూడమని చెబుతాం.. నెక్ట్స్ జనరేషన్ కు దగ్గరుండి చూపిస్తాం. ఆ కథ.. కథనం అలాంటిది. ఇక సినీ ఇండస్ట్రీలోకి రావాలి అనుకున్న ప్రతిఒక్కరూ ఒకటికి పదిసార్లు చూసుకోవాల్సిన.. చూసిన సినిమా అంటూ ఒకటి ఉన్నది అంటే అది గుండమ్మ కథ. ఈ సినిమాలో హీరో ఎవరు అంటూ ఎవరికి వారే.. అందరూ హీరోలే అంటారు. అలా ఉంటుంది గుండమ్మకథ. ఈ కథను నేటి తరానికి అనునుగుణంగా.. ఇప్పటి హీరోలతో తీయాలనే చాలా ఏళ్లుగా.. చాలా మంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పాత్రల్లో జీవించే నటీనటులే పెద్ద సమస్య. ఎట్టకేలకు ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో.. అద్బుతంగా తెరకెక్కించటానికి రెడీ అవుతుంది. దీనిపై ఇప్పటికే చాలా సిట్టింగ్స్ కూడా అయినట్లు ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్. డైరెక్టర్ దగ్గర నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరూ ఫిక్స్ అయ్యారని వాళ్ల కాల్షీట్స్ ఇస్తే.. అతి త్వరలోనే క్లాప్ కొట్టినా ఆశ్చర్యం లేదంటూ ఫిల్మ్ నగర్ లో చర్చ జరుగుతుంది. మరి ఆ డ్రీమ్ క్యాస్ట్ ఎవరో చూద్దామా.. ముఖ్యంగా ఇంత పెద్ద భారీ కథను తెరకెక్కించాలంటే సత్తా ఉన్నా డైరెక్టరే కావాలి.. అప్పట్లో కమలాకర్ కామేశ్వరరావు తీశారు.. మళ్లీ తీయమంటే అంత అద్బుతంగా తీయలేనని బతికి ఉన్న రోజుల్లో అనేవారంట. ఇప్పటి డైరెక్టర్స్ మాత్రం త్రివిక్రమ్ పర్ ఫెక్ట్ అంటున్నారు. అనటమే కాదు.. ఆయన ఆధ్వర్యంలోనే చర్చలు జరుగుతున్నాయి. ఫ్యామిలీ డ్రామాలు పండించటంలో సత్తా ఉన్న డైరెక్టర్. అంతేకాదు.. పంచ్ సీన్స్ ను రక్తికట్టించగలరు. నేటి నేటివిటీకి తగ్గట్టు కథను డీల్ చేయాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ తోపాటు యూత్ నాడి బాగా తెలిసిన త్రివిక్రమ్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని భావిస్తున్నారు. డైరెక్టరే కాదు.. ఇందులో ఘంటసాల అందించిన సంగీతం అత్యద్భుతం.. మరి ఇవాల్టి సిట్యువేషన్ తగ్గట్టుగా అంటే ఇద్దరే గుర్తొస్తున్నారు. ఒకరు కీరవాణి, మరొకరు దేవిశ్రీప్రసాద్. త్రివిక్రమ్-దేవిశ్రీ కాంబినేషన్ హిట్ టాక్. మెలోడీ, ఫాస్ట్ బీట్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ ఇవ్వగలడు.. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో కూడా దేవిశ్రీ స్పెషల్ బీట్. ఈ క్రమంలోనే సంగీత దర్శకుడిగా దేవిశ్రీని తీసుకున్నారంట త్రివిక్రమ్. మరి హీరోలు ఎవరు.. వాళ్ల ప్లస్ పాయింట్స్ ఏంటీ.. పార్ట్ 2లో చూద్దాం.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy