త్రివిక్రమ్ గుండమ్మకథ డ్రీమ్ క్యాస్ట్ -పార్ట్ 3

Gundamma Katha Dream Cast part 3ఇక ఈ సినిమా మొత్తానికి హైలెట్.. నడిపించేది.. నడిచేది సూర్యాకాంతం చుట్టూనే. గతంలో ఎన్నోసార్లు ఈ మూవీపై చర్చ జరిగినప్పుడల్లా ఎవరు సూర్యాకాంతం అనేదే బిగ్ క్వశ్చన్. ఇప్పుడు ఆ లోటు తీరిపోయిందంట త్రివిక్రమ్ కు. సీనియర్ యాక్టర్, అప్పటి హీరోయిన్ రాధికను ఫిక్స్ అయ్యారు. గడసరిగా.. వాయిస్ లోనూ బేస్ తో సరిపోతుందని డిసైడ్ అయ్యారు. రాధిక గత చిత్రాలను పరిశీలించి.. గడుసుతనాన్ని అంచనా వేసి.. మాట తీరు.. హావభావాలు.. ఇప్పుడు రాధిక వయస్సుతో సరిచూస్తే.. కరెక్ట్ అనే డిసైడ్ అయ్యారంట. ఈ విషయంలో రాధికను కూడా అప్రోచ్ అయినట్లు సమాచారం. ఏ మాత్రం వెనకాముందూ ఆలోచించకుండా.. ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కూతురు పెళ్లి హడావిడిలో ఉన్న రాధిక.. త్వరలోనే ఈ విషయంపై త్రివిక్రమ్ తో భేటీ అవుతున్నట్లు చెప్పుకుంటోంది ఫిల్మ్ నగర్. సూర్యాకాంతం అయితే ఓకే.. మరి ఆమెనే గడగడలాడించిన ఛాయాదేవికి ఎవరు సూట్ అవుతారు అనే విషయంపై కూడా నెలల తరబడి చర్చలు జరిగాయండీ. అప్పటి ఛాయాదేవి.. ఇప్పుడు మాత్రం రోజాని ఫిక్స్ అయ్యారు. ఈ రెండు పాత్రల ఎంపిక విషయంలోనే చాలా మేథోమథనం జరిగింది. వాళ్లను ఆయా క్యారెక్టర్స్ ఊహించుకుంటూ.. కొన్ని సీన్స్ ను వాళ్ల హావభావాలతో పోల్చిచూసుకుని మరీ ఓకే అనుకున్నారంట ఈ మెగా డైరెక్టర్. ప్రతి పాత్ర విషయంలోనూ ఆచితూచి వ్యవహరించే త్రివిక్రమ్.. ఆరు నెలలుగా గుండమ్మ కథపై సీరియస్ గా చర్చలు జరుపుతున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy