త్రివిక్రమ్ గుండమ్మకథ డ్రీమ్ క్యాస్ట్- పార్ట్ 4

Gundamma Katha Dream Cast part 4గుండమ్మ కథలో మరో ముఖ్యమైన పాత్రలు ఎస్వీర్, రమణారెడ్డి. ఈ రెండూ కూడా కథానుగుణంగా బలమైనవే. రమణారెడ్డి పాత్ర సింపుల్ గానే కొలిక్కి వచ్చేసింది.. పుల్లలు పెడుతూ.. అక్కోయ్ అంటూ వచ్చే పాత్రలో అలీ ఇప్పటికే త్రివిక్రమ్ ను నవ్వించేశాడంట. ఓ సిట్టింగ్ లో కొన్ని డైలాగ్స్ కు తనదైన శైలిలో అలీ కడపుబ్బా నవ్వించేసినట్లు సమాచారం. ఇక ఎస్వీర్ పాత్రకు మాత్రం ఇద్దరు, ముగ్గురిని అనుకుని.. చివరికి ప్రకాష్ రాజ్ ను ఫైనల్ చేసుకున్నారు. పాత్రను బట్టి ఒరిగిపోయే మనసు మన నటుడుది. ఇద్దరు యంగ్ హీరోస్ కు తండ్రిగా కూడా సూట్ అవుతాడు. డైలాగ్ ను బట్టి యాక్షన్ మార్చుకోవటంలో తనకు తనే సాటి.. దీంతో ప్రకాష్ రాజ్ ను ఫిక్స్ అయ్యారు. రాజేంద్రప్రసాద్, జగపతిబాబు కూడా త్రివిక్రమ్ మనసులో ఉన్నారననేది కూడా టాక్. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రయార్టీస్ భాగంగా ప్రకాష్ రాజ్ కాకపోతే.. రాజేంద్రప్రసాద్ ను రంగంలోకి దించొచ్చు. గుండమ్మ కథ అంటే ఓ కళాఖండం.. అలాంటి దాన్ని తిరగరాయటమే కాదు.. తీయాలన్నా ఎంత దమ్ము, ఖలేజా కావాలి. అందుకే త్రివిక్రమ్ చాలా జాగ్రత్తలతోపాటు.. కథ చెడకుండా ఉండేందుకు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ తరానికి చెబుతూనే.. పాత్రల ఎంపికకు యజ్ణమే చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy