త్రివిక్రమ్ గుండమ్మకథ డ్రీమ్ క్యాస్ట్- పార్ట్ 5

Gundamma Katha Dream Cast part 5 copyఇక మిగిలింది హీరోయిన్స్.. ఇక్కడే ఈ మెగా డైరెక్టర్ బాగా ఆలోచించాల్సి వచ్చిందంట. అప్పట్లో ఓసారి ఇదే కథ తీస్తే.. సావిత్రిని మెప్పించగల స్థాయి హీరోయిన్ ఎవరూ అంటే ఠక్కున సౌందర్య అని చెప్పారంట. దురదృష్టవశాత్తు ఆమె ఇప్పుడు లేరు. ఈ జనరేషన్ లో ఎవరా అంటే.. నయనతార అంటున్నారు. అప్పట్లో సావిత్రి పిండి రుబ్బటం.. లేచింది మహిళా లోకం సాంగ్.. వంటింట్లో కష్టాలు… ఆ పాత్ర ఇప్పటికే జనం కళ్లల్లో గుండెల్లో సజీవంగా ఉన్నాయి. ఈ కాలంలోనూ కట్టెలపొయ్యిలు.. బట్టలు ఉతకటం అనేది కష్టం కాబట్టి.. కనీసం మిక్సీలు, గ్రైండర్స్ వేయాలి కదా.. ఆ పాత్రలో ఒదిగిపోవాలంటే కొంచెం ఫ్యామిలీతోపాటు హోమ్లీ లుక్స్ కావాలి.. దీనికి నయనతార అయితేనే కరెక్ట్ అంటున్నారు. దీనికితోడు ఎన్టీఆర్ – నయనతార నటించిన అదుర్స్ మూవీ కూడా జోడీ కరెక్ట్ అని చెబుతోంది. అదుర్స్ లోని పాత్రలను చూస్తూ.. గుండమ్మకథలోని సావిత్రి చూస్తే మరీ 100శాతం మార్కులు ఇవ్వకపోయినా.. ఈనాటి సీతగా మెప్పించింది.. సావిత్రికి దగ్గరగా చేయలేదా అని ఫిక్స్ అయ్యారంట. చెల్లెలు క్యారెక్టర్ లో నాగ చైతన్యకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ ఫిక్స్ అయినట్లు సమాచారం. షాపింగ్, డబ్బులు దుబారాగా ఖర్చుచేసే పాత్రలో ఆనాడే జమున అంతటివాళ్లు మెప్పించారు. ఈనాటి హీరోయిన్స్ కు ఇలాంటి క్యారెక్టర్ కొట్టిన పిండి. అప్పుడు అంటే అది కొత్త.. ఇప్పుడు అది కామన్ కాబట్టి రకుల్ ప్రీత్ సింగ్ ఓకే అన్నట్లు సమాచారం. క్యారెక్టర్స్ అన్నీ ఓకేకానీ.. ఏఎన్నార్, జమున ఫామ్ హౌస్ లో తోటపని అదే క్లైమాక్స్ ను మాత్రం కొద్ది మార్పులతో.. ఈ జనరేషన్ కు తగ్గట్టుగా మార్పులు చేసినట్లు సమాచారం. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎత్తుకుంటున్న త్రివిక్రమ్.. భారీ ఎత్తున.. పక్కా కమర్షియల్ యాంగిల్ లోనే తెరకెక్కించాలని చూస్తున్నారు. గుండమ్మ కథ అని థియేటర్ కు వచ్చేవాళ్లకు పాత వాసనలు కనిపించకుండా.. కొత్త రుచులతో.. అసలు గుండమ్మ కథ ఇంత బాగుంటుందా అనుకుంటూ ధియేటర్ నుంచి వెళ్లాలనేది తన టార్గెట్ అంట. ఫిల్మ్ నగర్ లోనే కాదు.. ఇండస్ట్రీలో కోడై కూస్తున్న.. కృష్ణనగర్ లో జరుగుతున్న చర్చకు.. త్రివిక్రమ్ డ్రీమ్ క్యాస్ట్ పై జరుగుతున్న కసరత్తు దృశ్యమే ఇది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy