త్వరపడండి.. రాష్ట్రంలో 20లక్షల మంది కొత్త ఓటర్ల నమోదు

హైదరాబాద్ : రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ అప్ డేట్స్ ను ప్రకటించారు ఎన్నికల ముఖ్య అధికారి రజత్ కుమార్. ఓటరు ఎన్ రోల్ మెంట్ విషయంలో అంతటా మంచి స్పందన వస్తోందన్నారు. ఇప్పటి వరకు సుమారు 17 లక్షల నుంచి 20 లక్షల వరకు కొత్తగా ఓటర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు.

కొత్తగా ఓటర్ నమోదుకు ఇంకా ఐదు రోజుల సమయమే ఉంది. అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. లక్షా 50 వేల మంది ఓటర్లు చనిపోయారన్న సమాచారంతో.. వివరాలను అప్ డేట్ చేయాలని.. వారి సంబంధీకులకు నోటీసులు పంపిస్తామన్నారు.

రాష్ట్రంలో 23 జిల్లాలకు ఇప్పటివరకు ఈవీయంలు, వీవీ ప్యాట్స్ చేరుకున్నాయని చెప్పిన రజత్ కుమార్.. మిగతావి సెప్టెంబర్ 22 నాటికి అన్ని జిల్లాలకు చేరుకుంటాయని అన్నారు. మరోసారి కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందన్నారు. ఎన్నికల నిర్వహణ, సన్నద్ధతను పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘానికి రిపోర్ట్ చేస్తారని చెప్పారు రజత్ కుమార్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy