త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ

07-harish-rao-6002కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేదని తేల్చేశారు మంత్రి హరీష్ రావు. సేమ్ టైమ్ నామినేటెడ్ పోస్టులపై గుడ్ న్యూస్ చెప్పారు. దసరా తర్వాత ముహుర్తం ఫిక్స్ చేసినట్టు తెలిపారు. మంత్రివర్గ విస్తరణపై కొన్నాళ్లుగా బోలేడన్నీ ఊహాగానాలు షికార్లు చేశాయి. అసెంబ్లీ సమావేశాల్లోనే మార్పులు చేర్పులు చేస్తారని గుసగసలు చక్కర్లు కొట్టాయి. గవర్నర్ నరసింహన్ తో  సీఎం కేసీఆర్ పలుసార్లు భేటీ కావడం..కేబినెట్ విస్తరణ ఊహాగానాలకు బూస్ట్ నిచ్చాయి. కేబినెట్ విస్తరణ ఉలుకే లేదన్న హరిష్ రావు కామెంట్ తో..వ్యవహారం మొదటికి వచ్చినట్టైంది.  మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. కేబినెట్  విస్తరణ ఎప్పుడు జరిగినా..మహిళలకు ఒక్క  బెర్త్ ఖాయమని అనుకుంటున్నారు. మంత్రుల పోస్టులకు ..లిస్టు చాంతడంతా ఉంది. తమ ఫీడ్ బ్యాక్ తో బయోడేటాల్ని..ముఖ్యనేతలకు సమర్పించుకుంటున్నారు లీడర్లు. ఏదోలా కన్వీన్స్ చేసే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మహిళ నేతలు కూడా…చాలా మందే ఉన్నారు. నామినేటెడ్ పోస్టుల క్యూ కూడా..భారీగానే ఉంది. రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు..నామినేటెడ్ కుర్చీలో కర్చీఫ్ వేసేందుకు రెడీగా ఉన్నారు. సీఎం  కేసీఆర్, మంత్రులు, ముఖ్యనేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. టీఆర్ఎస్ భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. గతంలో చాలాసార్లు భర్తీ ఉంటుందని వార్తలు వచ్చినా.. వాయిదా పడుతూ వచ్చింది. ఈసారి మాత్రం దసరా తర్వాత పక్కా ముహూర్తం ఉంటుందంటున్నారు పార్టీ లీడర్లు.

మార్కెట్ పదవులపైనే పార్టీ వర్కవుట్ చేస్తోంది. మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లు ప్రకటించినా..షెడ్యూల్ రిలీజ్ చేయాలేదు. మార్కెట్ కమిటీల భర్తీతో..చోటా మోటా నేతల్ని ఖుషీ చేయోచ్చని ప్లాన్. త్వరలోనే పోస్టులు భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ కూడా సిగ్నల్స్ ఇచ్చినట్టు సమాచారం. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసి.. క్యాడర్ లో ఆత్మవిశ్వాసం పెంచాలనేది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది.  సేమ్ టైమ్ జనంలోకి వెళ్లేందుకు కేసీఆర్ రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల తర్వాత బస్సెక్కనున్నట్లు తెలుస్తోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy