త్వరలో మార్కెట్లోకి కొత్త నోకియా ఫోన్స్

new-nokia-phonesహెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ త్వరలో నోకియా 4, నోకియా 7 ప్లస్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు తెలిసింది. వీటితోపాటు నోకియా 6, 8 ఫోన్లకు చెందిన 2018 వేరియెంట్లను, నోకియా 9, నోకియా 1 స్మార్ట్‌ఫోన్లను, నోకియా 3310 4జీ వేరియెంట్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్, హెచ్‌డీ డిస్‌ప్లే, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ ఫీచర్లతో నోకియా 1ను మార్చి నెలలో రూ.6,670 ధరకు హెచ్‌ఎండీ గ్లోబల్ విడుదల చేయవచ్చని తెలుస్తుండగా అదే నెలలో నోకియా 4, 7ప్లస్‌లను విడుదల చేయనున్నారు. అలాగే ఈ నెల 19వ తేదీన చైనాలో జరగనున్న ఈవెంట్‌లో నోకియా 9ను విడుదల చేయవచ్చని తెలిసింది. ఇక నోకియా 6, 8 ఫోన్లకు గాను 2018 వేరియెంట్లను, నోకియా 3310 4జీ వేరియెంట్‌ను ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేయవచ్చని సమాచారం. దీంతో రానున్న మూడు నెలల కాలంలో మొత్తం 7 నోకియా ఫోన్లు విడుదల కానున్నాయి. అయితే ఈ ఫోన్ల లాంచింగ్ తేదీలను హెచ్‌ఎండీ గ్లోబల్ ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించలేదు. త్వరలో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy