త్వరలోనే సిటీలో మెట్రో కూత

metro-railత్వరలోనే మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. ఫస్ట్ ఫేజ్ కింద నాగోల్ టు మియాపూర్ 30కి.మీ స్ట్రెచ్ ను ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే మెట్రో ట్రైన్ ఎక్కేందుకు..ఇళ్ల నుంచి స్టేషన్ కు.. స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లేందుకు సౌకర్యాలేవనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. మెట్రో లాంచ్ కు మరో నెల రోజులు మాత్రమే టైమ్ ఉంది. కానీ మెట్రో స్టేషన్లల్లో  పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేయలేదు.  నెల రోజుల్లో పార్కింగ్  స్థలాల ఏర్పాటు సాధ్యమేనా  అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరైన పార్కింగ్  ప్లేసులు లేకపోతే… రాబోయే రోజుల్లో మెట్రో స్టేషన్ల దగ్గరే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది.

అవసరానికి దగ్గ పార్కింగ్ లేదు

నాగోల్ నుంచి అమీర్ పేట వరకు 7 స్టేషన్ల నిర్మాణం 2015 ఉగాది నాటికే పూర్తైంది. నాగోల్, ఉప్పల్, సర్వే ఆఫ్ ఇండియా, ఎన్జీఆర్ఐ, హబ్సిగూడ, తార్నాక, మెట్టుగూడ స్టేషన్లు రెడీ అయ్యాయి. ఆ తర్వాత సికిందాబ్రాద్  రైల్వే స్టేషన్, ప్యాట్నీ స్టేషన్, ప్యారడైజ్, రసూల్ పుర చౌరస్తా, బేగంపేట షాపర్స్ సాప్ట్, బేగంపేట రైల్వే స్టేషన్, అమీర్ పేట ఇంటర్ చేంజ్  స్టేషన్ల పనులు స్పీడందుకున్నాయి. ఈ స్టేషన్లలో అవసరాలకు తగినట్టుగా పార్కింగ్ ప్లేసులు లేవు. కారిడార్ -1 లో అమీర్ పేట నుంచి మియాపూర్ వరకు 11 మెట్రో స్టేషన్లు ఉండగా, మియాపూర్, జేఎన్టీయూ, కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, బాలానగర్, మూసాపేట, భరత్ నగర్, ఎర్రగడ్డ, ఈఎస్ఐ ఆస్పత్రి, ఎస్సార్ నగర్ మెట్రో స్టేషన్ల నిర్మాణం 8 నెలల కిందే పూర్తైంది. వీటిలో మియాపూర్, భరత్ నగర్ స్టేషన్లు మినహా మిగతా స్టేషన్లల్లో పార్కింగ్ ఫెసిలిటీస్ సరిగా లేవు. నిర్మాణంలో ఉన్న అమీర్ పేటలో ఇంటర్ చేంజ్  స్టేషన్ దగ్గర పార్కింగ్ కోసం స్థలం ఉంది. దాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది.

32 పార్కింగ్ కాంప్లెక్స్ లు

మెట్రో రైలు ప్రారంభమైతే పార్కింగ్ ఇబ్బందులు రాకుండా చూస్తామంటున్నారు అధికారులు. 72 కి.మీ మెట్రో రూట్లో.. మూడు కారిడార్లలో.. మొత్తం 32 పార్కింగ్ కాంప్లెక్స్ లను అభివృద్ధి చేస్తున్నారు. L & T 17, HMR 15 ఏరియాల్లో పార్కింగ్ కాంప్లెక్సులు కడుతున్నాయి. త్వరలో అందుబాటులోకి రానున్న నాగోల్ టు మియాపూర్ 30 కి.మీ రూట్లో L & T 7, HMR 6 పార్కింగ్ అండ్ సర్క్యులేషన్ను డెవలప్ చేస్తున్నాయి. 12 స్ట్రీట్ పార్కింగ్, 11 కార్ పార్కింగ్ ఏరియాలను డెవలప్ చేయనున్నారు.  L&T, HMR ఆధ్వర్యంలో  మూడు కారిడార్లలోని 17 స్టేషన్లలో పార్కింగ్ కాంప్లెక్సులు నిర్మాణ దశలో ఉన్నాయి. నాగోల్ టు మియాపూర్ 30 కి.మీల స్ట్రెచ్ లో 24 స్టేషన్లున్నాయి. అయితే పార్కింగ్ విషయంలో పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నామంటున్నారు అధికారులు. ఇక ఓలా, ఉబర్ తో పాటు ప్రైవేట్ వెహికిల్స్ ఆగేందుకు మెట్రో స్టేషన్స్ దగ్గర ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పార్కింగ్ ఫీజును ఇంకా నిర్ణయించలేదన్నారు అధికారులు.

స్టేషన్ల దగ్గర పార్కింగ్ కోసం L&T.. అమీర్ పేట్ చాలీస్ మకాన్ దగ్గర 1.69 ఎకరాలు, పంజాగుట్టలో 4 ఎకరాలు, పరేడ్ గ్రౌండ్స్ లో ఎకరం, మియాపూర్ టెర్మినల్ స్టేషన్ 5 ఎకరాలు, బాలానగర్ హుడా ట్రక్ టెర్మినల్ 2 ఎకరాలు, ఎర్రమంజిల్ దగ్గర నిర్మిస్తున్న మాల్స్ లో 4 ఎకరాలు, మలక్ పేట్ లో 3.65 ఎకరాలు,  ఎల్బీనగర్ ఇండోర్ స్టేడియం ఎదుట 1.66 ఎకరాలు, ఫలక్ నుమా టెర్మినల్ స్టేషన్ 4 ఎకరాలు, హైటెక్ సిటీలో 2 ఎకరాలు,  నాగోల్ టెర్మినల్ స్టేషన్లో 4 ఎకరాలు, రాయదుర్గంలో 15 ఎకరాలు, యూసుఫ్ గూడ గ్యాలరీ దగ్గర 00.80 ఎకరాలు, సికింద్రాబాద్ వెస్ట్ స్టేషన్ కోసం 5.05 ఎకరాలు, ఎంజీబీఎస్ దోబీఘాట్ ల్యాండ్ దగ్గర 0.65 ఎకరాలు, కూకట్ పల్లి స్కూల్ ల్యాండ్ ఎకరం, రసూల్ పురా పోలీస్ క్వార్టర్స్ కాడ 1.5 ఎకరం చొప్పున్న మొత్తం 57 ఎకరాల భూమిని కేటాయించినట్టు చెప్పారు మెట్రో అధికారులు. త్వరలో మెట్రో పార్కింగ్ కోసం టెండర్లు పిలుస్తామన్నారు.  ఉప్పల్, సికింద్రాబాద్ వెస్ట్, ప్యారడైజ్, బేగంపేట్,  మధురానగర్,  జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, మాదాపూర్, యూసుఫ్ గూడ, భరత్ నగర్, నాంపల్లి, గాంధీభవన్, ఎంజీబీఎస్, విక్టోరియా మెమోరియల్, నారాయణగూడ స్టేషన్, సుల్తాన్ బజార్ పుత్లీబౌలి ప్రాంతాల్లో పార్కింగ్ కాంప్లెక్స్ లు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మెట్రో మొదలయ్యాక పార్కింగ్ ఇబ్బందులు రాకుండా  ట్రాఫిక్ పోలీసులు, మెట్రో, జీహెచ్ఎంసీ, ఆర్టీసీ సమన్వయంతో పనిచేసేలా చూస్తామంటున్నారు అధికారులు .

నవంబర్లో మొదలయ్యే నాగోల్ టు మియాపూర్ 30 కి.మీ రూట్లో 10 నుంచి 12 పార్కింగ్ కాంప్లెక్స్ లు ఏర్పాటు చేస్తున్నారు. అమీర్ పేట్ చార్లెస్ మకాన్, పరేడ్ గ్రౌండ్స్  జీహెచ్ ఎంసీ ఆఫీస్, మియాపూర్ ఓపెన్ ల్యాండ్, బాలానగర్ హుడా ట్రక్ టెర్మినల్, నాగోల్ టెర్మినల్ స్టేషన్, కూకట్ పల్లి స్కూల్ ల్యాండ్, రసూల్ పురా పోలీస్ క్వార్టర్స్ ల్యాండ్, ఉప్పల్, సికింద్రాబాద్ వెస్ట్, ప్యారడైజ్, బేగంపేట, మధురానగర్, భరత్ నగర్ ప్రాంతాల్లో పనులు చివరి స్టేజ్ కు వచ్చాయి. అయితే ఆటోవాలాలు మాత్రం తమకు ఆదాయం వచ్చేలా మెట్రో స్టేషన్స్ దగ్గర ఆటోస్టాండ్ లను ఏర్పాటు చేయాలంటున్నారు. మెట్రో  ప్రయాణికులు స్టేషన్ కు వచ్చేందుకు సొంత వెహికిల్సే బెటర్ అంటున్నారు జనం. రాత్రి వేళల్లో తిరిగి వెళ్లడానికి ఓన్ వెహికల్స్ ఉంటేనే ఈజీ అవుతుందంటున్నారు. స్టేషన్ల నుంచి కాలనీలకు మినీ బస్ లను నడపాలంటున్నారు. అయితే మెట్రో లో పార్కింగ్ ఫీజుపై అటు HMR ఇటు L&T మెట్రో అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇవే కాకుండా ఆదాయాన్ని పెంచుకునేందుకు మెట్రో కడుతున్న షాపింగ్ కాంప్లెక్సుల్లో మల్టీలెవల్ పార్కింగ్ ఏర్పాటు చేయబోతున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy