త్వరలో ఇంటింటికి ఫైబర్ కనెక్షన్

kcrరాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఫైబర్ కనెక్షన్స్ ఇస్తామన్నారు సీఎం కేసీఆర్. మిషన్ భగీరథ పనులు తొందరగా పూర్తి చేయాలన్నారు సీఎం. దీనిపై  ప్రగతి భవన్ లో మే 1న అధికారులతో మీటింగ్ వెట్టారు కేసీఆర్. మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ కేకే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్,  ఇతర ఉన్నతాధికారులు, ఇంజనీర్లు సమీక్షలో పాల్గొన్నారు. సర్కార్ చెప్పినట్టు ఈ ఏడాది చివరికల్లా  గోదావరి, కృష్ణా నీళ్లు ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ల ద్వారా అందించాలని ఆఫీసర్లకు చెప్పారు సీఎం. పనుల్లో ఇబ్బందులొస్తే వర్కింగ్ ఏజెన్సీలు, లీడర్లు, అధికారులతో కలిసి పనిజేసి.. సమస్యను పరిష్కరించుకోవాలన్నరు. పైపులైన్ లలో నల్లా కనెక్షన్ తో పాటు పైబర్ కేబుల్ కూడా వేయాలన్నారు కేసీఆర్.

ఇటు కల్తీవిత్తనాలు సరఫరా చేస్తున్న కంపెనీల సంగతి తేలుస్తామన్నారు సీఎం. ఈ కంపెనీలపై చర్యలు తీసుకోవడానికి ఆర్డినెన్స్ తీసుకువస్తామన్నారు. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఇతర ఉన్నతాధికారుతో ఆయన మాట్లాడారు. రైతులకు ఇచ్చే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులన్నీ నాణ్యమైనవే ఇవ్వాలని.. లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సీఎం. రాష్ట్రంలో కల్తీ, నకిలీలకు అవకాశమనేదే లేకుండా చేస్తామన్నారు. ఇందుకోసం త్వరలోనే ఆర్డినెన్స్ తీసుకు వస్తామన్నారు.

 

 

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy