త్వరలో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్

ktrఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న.. హైదరాబాద్ లోని అంబర్ పేట ఫ్లైఓవర్, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు మంత్రి కేటీఆర్. ఈ రెండు ప్రాజెక్టులకు భూసేకరణ రెండు నెలల్లో పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే GHMC భూసేకరణ నోటీసులు కూడా ఇచ్చిందన్నారు. 960 కోట్ల రూపాలతో ఉప్పల్ నుంచి నందనవనం భాగ్యనగర్ వరకు 6.4 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తామన్నారు. అంబర్ పేట ప్లైఓవర్ కు మొత్తం 243 కోట్ల పనులకు కేటాయింపులు చేసామని చెప్పారు. ఈ ప్రాజెక్టులో గోల్నాక నుంచి రామాంతాపూర్ వరకు 1.4 కిలోమీటర్ల ప్లైఓవర్ నిర్మిస్తామని తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి ప్రతిపాదనల దగ్గరే ఉన్న ఈ ప్రాజెక్టులు.. ఇప్పుడు సర్కార్  ముందుపడటంతో .. కదలిక వచ్చిందన్నారు. 12 వందల కోట్ల ఖర్సుతో కట్టే ఈ రెండు ప్రాజెక్టులను రెండేళ్లలోనే నిర్మిస్తామన్నారు మంత్రి కేటీఆర్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy