త్వరలో ఎంపీల జీతభత్యాలు డబుల్ హైక్

indianparliamentపార్లమెంటు  సభ్యుల జీతభత్యాలు త్వరలో పెరగనున్నాయి. ప్రస్తుతం  ఎంపీలు  పొందుతున్న జీతభత్యాలకంటే రెట్టింపు మొత్తంలో వారికి అందనున్నాయి. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఇప్పటికే ఆర్థికశాఖకు ప్రతిపాదన చేసినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఎంపీల జీతాలు రెట్టింపును ఖరారు చేసే అవకాశం ఉంది. దీని ప్రకారం ప్రస్తుతం ఎంపీకి రూ.50 వేలు చెల్లిస్తుండగా… అది లక్షకు పెరగనుంది. అలాగే కార్యాలయ ఖర్చులు, నియోజకవర్గ అలవెన్సులు రూ.45 వేలు చెల్లిస్తుండగా దానిని 90  వేలు చేయనున్నారు. ఇతర అలవెన్సులో మరో లక్ష అందనున్నాయి. ఆర్థికశాఖ అప్రోవల్ లభిస్తే మొత్తం రూ.2.8లక్షల జీతభత్యాలు ఒక్కో లోక్ సభ, రాజ్యసభ సభ్యుడికి అందనున్నాయి. అయితే..చాలామంది నేతలకు తమ జీతాలను పెంచడం మాత్రం ఇష్టం లేదట. ఐటీ డిపార్ట్ మెంట్ వల్ల చిక్కులు వస్తాయని, అందుకే తమ అలవెన్సులు మాత్రం పెంచితే చాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో 2010లో ఒకసారి పార్లమెంటు నేతలకు జీతభత్యాలు పెంచారు. తిరిగి పెంచేందుకు ఇదే తగిన సమయని కేంద్రం భావిస్తోంది. దీంతో వచ్చే ఫిబ్రవరిలో ప్రారంభంకానున్న బడ్జెట్ సమావేశాల్లో వారి జీతాల పెంపు అంశాన్ని సభ ముందుకు తీసుకురావాలని భావిస్తోంది.

 

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy