త్వరలో ఢిల్లీకి కొత్త సర్కార్..?

delhi-bjp-meet-240_635411213779278645ఢిల్లీలో కొత్త ప్రభుత్వం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ కొత్తగా ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తులు చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యేలు, మేజిక్ ఫిగర్ గురించి బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీకి మద్దతిచ్చేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. ఇక ఢిల్లీలో ప్రెష్ ఎలక్షన్లు తప్పించుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారంట. గతంలో హర్షవర్ధన్ సీఎం అభ్యర్ధిగా ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ..ప్రస్తుతం కొత్త వ్యక్తిని తెరపైకి తెచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే జగదీష్ ముఖీ పేరును సీఎంగా పరిశీలిస్తుంది. బీజేపీకి 31 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో మిత్రపక్షం అకాళీ దళ్ నుంచి మరో ఎమ్మెల్యేలు ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ కు మరో నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి కావాల్సి ఉండటంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పెద్ద కష్టమేమి కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

బీజేపీ ఢిల్లీ చీఫ్ గా సతీష్ ఉపాద్యాయ, జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా ఎన్నికైన తర్వాత ఢిల్లీలో కొత్త ప్రభుత్వం గురించి వార్తలు స్పీడందుకున్నాయి. త్వరలోనే ఢిల్లీ బీజేపీ నేతలో ప్రెసిడెంట్ అమిత్ షా భేటీ కానున్నారు. ఆగష్టులోపు ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ఇప్పటికే ఢిల్లీ చీఫ్ సతీష్ కు చెప్పారంట. దీని గురించే పార్టీ నేతలతో మరోసారి మీటింగ్ నిర్వహించనున్నారు అమిత్ షా. ఇప్పటికే 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్ కు చెందిన ఆరుగురు బీజేపీతో టచ్ లో ఉన్నట్లు..ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారంట. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ ఈ వార్తలను ఖండిస్తున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరితోనూ టచ్ లో లేరని తేల్చి చెప్పారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy